Viral Video : కొంతమంది సాయం అడిగితే డబ్బులు ఇస్తారు. కానీ వారికి ఏది అవసరమో గమనించి సాయం చేస్తే అది మరింత అర్థవంతంగా ఉంటుంది. అలాంటి మంచి పని చేసిన వ్యక్తి మొహమ్మద్ ఆషిక్(Mohamed Ashik instagram id : @abrokecollegekid).
ఓ హోటల్‌లో భోజనం చేస్తున్న ఆషిక్‌కు రోడ్డుపై కూర్చుని ఉన్న ఓ కుటుంబం కనిపించింది. వాళ్ళు ఆకలితో ఉన్నట్లు కనిపించడంతో ఆషిక్ వాళ్ళని తన దగ్గరికి పిలిచాడు. ఆ కుటుంబంలోని పెద్దలు, పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టించాడు.
ఆషిక్ చేసిన ఈ మంచి పని సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు ఆషిక్‌ను హీరో అంటూ అభినందిస్తున్నారు. మరికొందరు ఆషిక్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆషిక్ చేసిన పని మనందరికీ స్ఫూర్తినిస్తుంది. ఇలాంటి మంచి పనులు చేస్తూ ప్రపంచాన్ని మరింత మంచి ప్రదేశంగా మార్చుకుందాం.