Viral Video : ఒంటరిగా వెళ్తున్న మహిళలు, యువతులు, చిన్నారులపై కన్నేసి వారిని లైంగికంగా వేధింపులకు గురిచేసే పోకిరిగాళ్లు అక్కడక్కడా కనినిస్తూనే ఉంటారు. వారి బారి నుంచి ఆడవాళ్లను రక్షించేందుకు కొందరు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఈ క్రమంలో బస్టాండ్లలో, రైల్వే స్టేషన్ల సమీపంలో, కాలనీల్లో జనసంచారం లేని ప్రాంతాల్లో ఒంటరిగా మహిళలు, అమ్మాయిలు కనిపిస్తే వేధింపులకు దిగే బ్యాచ్ నిత్యం కనిపిస్తూనే ఉంటారు. సమీప ప్రాంతాల్లో జనం ఉంటే ఇలాంటి దుండగులు వెంటనే పారిపోతుంటారు.
తాజాగా వైరల్ అయిన ఓ వీడియోలో ఓ యువకుడు ఇలాంటి పనే చేశాడు. ఒంటరిగా బస్టాప్ వద్దకు నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిపై పోకిరి కన్నేశాడు. ఇంకేముందీ.. అనుకున్నదే తడవుగా ఆమెను ఫాలో చేశాడు. రోడ్డుపై ఎవరూ లేరని కన్ఫం చేసుకున్నాక యువతి వద్దకు వెళ్లాడు. ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ముద్దులు పెట్టుకోవాలని ప్రయత్నించాడు. కీచకుడి నుంచి తప్పించుకొనేందుకు ఆ యువతి చాలా రకాలుగా ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ అతడు గట్టిగా చేతులతో పట్టుకోవడంతో విడిపించుకోలేకపోతోంది.
అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ యువకుడు రెచ్చిపోతున్నాడు. నడిరోడ్డుపై ఇదంతా జరుగుతోంది. ఇది ఎక్కడ జరిగిందనేది తెలియరాలేదు గానీ.. సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఇక ఆ యువకుడి బారి నుంచి తనను రక్షించే వారి కోసం యువతి ఎదురు చూడసాగింది. ఇంతలోనే ట్విస్ట్ చోటు చేసుకుంది. రోడ్డుపై దూరంగా ఓ మనిషి వస్తున్నాడు. అయినప్పటికీ ఆ కామాంధుడు లెక్క చేయకుండా వేధించసాగాడు. ఇంతలోనే అటువైపు ఓ బస్సు వచ్చింది.
అప్పుడే అక్కడికి వచ్చిన బస్సులోంచి కొందరు ఈ తతంగాన్ని దూరం నుంచే గమనించ సాగారు. దీంతో అక్కడికి రాగానే బస్సును డ్రైవర్ ఆపేశాడు. బస్సులో వారు తననెందుకు అడ్డుకుంటారులే అనుకున్నాడో ఏమో.. తన చేష్టలు కొనసాగించాడు ఆ యువకుడు. ఇంతలో బస్సులోంచి దిగిన కొందరు.. ఆ కీచకుడిని చుట్టుముట్టారు. పోకిరికి దేహశుద్ధి చేశారు. నాలుగు తన్ని బుద్ధి చెప్పారు. అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఇవి కాస్త కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు వైరల్ అయ్యాయి. కీచకుడికి తగిన శాస్తి జరిగిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE