Telugu Flash News

Viral video : అక్కడ డ్యాన్స్‌ చేసినందుకు పదేళ్ల జైలు శిక్ష.. ఇరాన్‌లో యువ జంటకు షాక్‌!

Viral video : ఇరాన్‌ దేశంలో అత్యంత కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. ఇస్లామిక్‌ దేశం కావడంతో అక్కడ నిబంధనలు అతిక్రమించిన వారికి దారుణంగా ప్రభుత్వం శిక్షలు విధిస్తోంది. తాజాగా 21 ఏళ్ల యువ జంటకు షాక్‌ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. బహిరంగంగా డ్యాన్స్‌ చేసినందుకు వారికి పదిన్నరేళ్లపాటు కారాగార వాసాన్ని విధించింది. ఇంతకీ వారు ఏం చేశారో చూడండి..

ఇరాన్‌లో బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్‌ చేయడం నిషిద్ధం. అయితే, అక్కడి ప్రఖ్యాత టూరిస్ట్‌ ప్రదేశం అయిన ఆజాదీ టవర్ వద్ద అస్తియాజ్ హఘిఘీ అనే యువతి, ఆమెకు కాబోయే భర్త అమీర్ మొహమ్మద్ అహ్మదీ కలిసి డ్యాన్స్‌ చేశారు. కాబోయే భార్యను చేతులతో పట్టుకొని నృత్యంతో మైమరచిపోయాడు ఆ యువకుడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఈ యువ జంటపై అత్యంత కఠినంగా వ్యవహరించింది.

ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ నిబంధనల్ని ధిక్కరించారంటూ వారిపై కేసు నమోదు చేసి గతేడాది నవంబర్‌లో అరెస్టు చేశారు పోలీసులు. ఇరాన్‌ రూల్స్‌ ప్రకారం స్కార్ఫ్‌ ధరింకపోవడంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో పురుషుడితోకలిసి నృత్యం చేసినందుకు ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీంతో ఈ యువ జంటకు పదిన్నరేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది ప్రభుత్వం. దీంతోపాటు ఇంటర్నెట్‌ వినియోగం, దేశం విడిచిపోరాదంటూ ఆక్షలు విధించింది ఇరాన్‌ సర్కార్‌.

ప్రభుత్వ కఠిన నిర్ణయం కారణంగా బెయిల్‌పై విడుదల కావడానికి కూడా అంగీకారం లభించలేదు. టెహ్రాన్‌లోని ఖార్చక్‌ మహిళా జైలులో హగీఘీ ప్రస్తుతం కారాగార వాసం అనుభవిస్తోంది. ఇటీవల ఇరాన్‌లో ఇస్లామిక్‌ డ్రెస్‌ కోడ్‌ పాటించలేదన్న కారణంగా జినా మహ్సా అమిని అనే యువతిని అరెస్టు చేయడంతో ఆమె అవమానభారంతో చనిపోయింది. ఈ ఘటనతో ఇరాన్‌లో నిరసనలు ఆకాశాన్నంటాయి. వేలాది మందిని ప్రభుత్వం అరెస్టు చేసింది. మహిళలు భారీ ఎత్తున హిజాబ్‌పై నిరసనలు తెలిపారు.

also read :

Vijay- Rashmika : ర‌ష్మిక‌, విజ‌య్ మ‌ధ్య ఏం న‌డుస్తుంది..? మొన్న మాల్దీవులు.. ఇప్పుడు దుబాయ్ టూర్..

Adani Group : ఎఫ్‌పీవో రద్దు చేసుకున్న అదానీ గ్రూప్‌.. 20వేల కోట్లు ప్రాజెక్టుపై వెనక్కి!

Exit mobile version