నిరాశ్రయుడైన ఓ వ్యక్తి వీధికుక్కలకు ఆశ్రయం కల్పిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని ఐఎఫ్‌ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారి సుశాంత నందా ఆదివారం షేర్ చేశారు. “ఈ పెద్ద ప్రపంచానికి అనుగుణంగా మన హృదయం తగినంత పెద్దదిగా ఉండాలి” అని మిస్టర్ నందా ఆ పోస్ట్ యొక్క శీర్షికలో రాశారు.
ఇందులో ఒక నిరాశ్రయుడైన వ్యక్తి అతని క్రింద ఒక దుప్పటిలాంటి బట్టతో రోడ్డు పక్కన పడుకుని ఉన్నాడు. అతను దాదాపు ఏడు వీధికుక్కలతో తన చిన్న పరుపును పంచుకోవడం చూసి చాలామంది జంతు ప్రేమికులకు ముచ్చట పడ్డారు, ఏమి లేకపోవడం అనే పరిస్థితి అటువంటి వారికే బాగా అర్ధం అవుతుంది అని ఈ ఫోటో చూస్తే తెలుస్తుంది.
ఈ ఫొటోలో ఇంకా నచ్చేది ఏంటంటే, ఆ వ్యక్తి తనకు తనకు మాత్రమే కాకుండా తన జంతు స్నేహితులకు కూడా నీడను అందించడానికి గొడుగును తెరిచి ఉంచాడు.
ఈ చిత్రం త్వరగానే ఇంటర్నెట్ యూజర్ల దృష్టిని ఆకర్షించింది, నెటిజెన్లు ఆ వ్యక్తిది బంగారు మనసు అంటూ కొనియాడుతున్నారు. మిస్టర్ నందా పెట్టిన ఈ పోస్ట్‌కి దాదాపు 1,000 లైక్‌లు వచ్చాయి.
Out heart has to be large enough to accommodate this big world. pic.twitter.com/LjQGYaARjR
— Susanta Nanda (@susantananda3) November 20, 2022
పెంపుడు జంతువులు మరియు వాటి చేష్టలు ఖచ్చితంగా అందరిని ఆకట్టుకుంటాయి. ఇటీవల, రాత్రి భోజనం చేస్తున్నప్పుడు కుక్క తన యజమాని ఆహారాన్ని తదేకంగా చూస్తున్న పాత వీడియో కేవలం వారం రోజుల్లోనే మిలియన్ల కొద్దీ వీక్షణలను పొందింది.
ఒక వ్యక్తి సోఫాలో తన రాత్రి భోజనం చేస్తున్నప్పుడు, అతని కుక్క సోఫాకు అవతలి వైపున కూర్చున్నట్లు వీడియోలో కనిపించింది. అతను ఆహారాన్ని కొంచెం నోట్లో పెట్టుకోగా, కుక్క అతని రుచికరమైన భోజనం వైపు చూసింది. కానీ అతను కుక్క వైపు చూసిన వెంటనే, వేరేవైపు చూస్తూ పట్టించుకోనట్లు ప్రవర్తించింది.
also read news: