Telugu Flash News

Viral Video : వావ్‌.. గ్రేట్‌ అనిపించే వీడియో.. 15,730 కేజీల ట్ర‌క్కును పళ్లతో లాగేశాడు!

Heaviest road vehicle pulled with teeth

Heaviest road vehicle pulled with teeth

Viral Video : సాధారణంగా దంతాలు బలంగా ఉంచుకోవడం కోసం రకరకాలుగా ప్రజలు ప్రయత్నాలు చేస్తుంటారు. బలమైన ఆహారం తీసుకోవడం, దంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం లాంటివి చేస్తుంటారు. దంతాలు బలంగా ఉంటేనే ఆహారం సరిగ్గా నమిలి మింగుతాం. తద్వారా జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. అయితే, దంతాలతో తరచూ కొందరు ప్రయోగాలు చేస్తుంటారు. సినిమాల్లో చూపించినట్లుగా కత్తులను పళ్లతో కరుచుకొని పట్టుకోవడం, కొన్ని రకాల వస్తువులను పళ్లతోనే పట్టుకొనే ప్రయత్నాలు చేస్తుంటారు.

తాజాగా ఈజిప్టుకు చెందిన ఓ వ్యక్తి ఇలా ట్రై చేశాడు. కాకపోతే ఏకంగా వేలాది కేజీల బరువు కలిగిన ట్రక్కును నోటితో కరుచుకొని లాగేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. లక్షలాది మంది ప్రజలు ఈ వీడియోను వీక్షించి ఔరా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. పళ్లతో కరుచుకొని లాగినందుకు పలు రికార్డులు కూడా బద్దలు కొట్టాడు ఈ వ్యక్తి.

ఈజిప్టుకు చెందిన అష్రఫ్‌ సులేమాన్‌.. ఈ ఘనత సాధించాడు. మనిషి చూడ్డానికి చాలా బలంగా కనిపిస్తున్నాడు. అంతేకాదు.. దంతాలు అంతకంటే బలంగా ఉన్నాయని రుజువు చేశాడు సులేమాన్‌. రోమాలు నొక్కబొడిచేలా ఉన్న ఈ సాహసాన్ని నెటిజన్లంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దాదాపు 15,730 కేజీల బరువు కలిగిన ఓ భారీ ట్రక్కును ఇతగాడు అవలీలగా పళ్ల సాయంతో లాగేశాడు. ఈ నేపథ్యంలో గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సొంతం చేసుకున్నాడు సులేమాన్‌.

గతేడాదే ఈ రికార్డు..

భారీ ట్రక్కును సులేమాన్‌ పళ్లతో లాగేసిన వీడియోను గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ తన ఇన్‌ స్టా గ్రామ్‌లో పోస్టు చేసింది. నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈజిప్టు రోడ్ల‌పై సులేమాన్ త‌న దంతాల‌కు.. ట్ర‌క్కుకు ఓ తాడును కట్టి లాగేశాడు. 2021 జూన్ 13వ తేదీన సులేమాన్ ఆ రికార్డును క్రియేట్ చేసిన‌ట్లు గిన్నిస్ బుక్ పేర్కొంది. అయితే, ఈ వీడియోను రెండ్రోజుల కిందటే పోస్టు చేసింది. ఇప్పటికే 4 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.



Watch Video :

Pigeon: శబరిమలలో విడిచిపెట్టినా.. ఆ పావురం తిరిగి యజమానిని చేరుకుంది.. కర్ణాటకలో ఆశ్చర్యకర ఘటన!

US Visa : అమెరికా వీసాలపై సంచలన నిర్ణయం.. భారీగా ఫీజులు పెంచేసిన బైడెన్‌ ప్రభుత్వం!

Divorce: కొత్త సంవ‌త్స‌రంలో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరో.. అవాక్క‌వుతున్న అభిమానులు


Exit mobile version