Viral Video : మనదేశంలో ఇప్పటికీ అనేక గ్రామీణ ప్రాంతాలు, మారుమూల కొండ కోనల్లో నివసించే ప్రజలకు వాగులు, వంకలు దాటడం ఒక సవాల్‌గా నిలుస్తోంది. పాత కాలంలో నిర్మించిన వంతెనలు కొన్ని కాలక క్రమేణా కూలిపోతుంటాయి. ఈ క్రమంలో ప్రజలు వంతెనలు దాటేందుకు చాలా ఇబ్బందులు పడుతుంటారు.
అయితే, కొన్ని ప్రాంతాల్లో ప్రజలే స్వచ్ఛందంగా వెదురు కట్టెల సాయంతో వంతెనలు నిర్మించుకుంటూ ఉంటారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన చాలా వంతెనలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇలా కాలక్రమంలో కొన్ని దెబ్బతిని కూలిపోయే స్థితికి చేరుకోవడంతో కూల్చివేతలు కూడా జరిగాయి.
అయితే, అప్పట్లోనే ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించిన కొన్ని బ్రిడ్జిలు ఏళ్ల తరబడి నిలిచి ప్రజలకు రవాణా సాధనంగా ఉపయోగపడుతున్నాయి. అంతటి ఇంజనీరింగ్ అద్భుత సృష్టిని ఇప్పటికీ మెచ్చుకుంటుంటారు. అయితే, చాలా ప్రాంతాల్లో నేటికీ సరైన వంతెన సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొండకోనల్లోని ప్రజలు సమీప గ్రామాలకు వెళ్లాలంటే నదులు దాటాల్సి వస్తుంది. ఈ క్రమంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తాజాగా వైరల్ అయిన ఓ వీడియోలో వంతెన దాటేందుకు ప్రజలు మర్రిచెట్టును ఆశ్రయిస్తున్నారు.
ప్రకృతి ప్రసాదించిన నేచురల్ వంతెన అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో చూస్తే సాహస ప్రయాణం అద్భుతం అనిపించేలా ఉంది. ఈ వీడియోలో నది ప్రవహిస్తోంది. నదిని దాటేందుకు కొందరు స్త్రీలు చెట్టుపైకి ఎక్కి వంతెనను దాటుతున్నారు.
నదిని దాటి అవతలి వైపునకు వెళ్లేందుకు కాంక్రీట్ వంతెన అందుబాటులో లేకపోవడంతో ఇలా చెట్టునే వంతెనగా చేసుకున్నారు. చెట్టుపై మెల్లగా ముందుకు సాగి, తర్వాత చెక్క వంతెన మీదుగా ప్రయాణం చేస్తున్నారు. అక్కడి వారికి నదిని దాటడం అలవాటుగా మారిపోవడంతో భయం, బెరుకు లేకుండా హాయిగా అవతలివైపు వెళ్తున్నారు.
అయితే ఈ వంతెన ఎక్కే ముందు ఎవరైనా తెలియని వ్యక్తి చూస్తే మాత్రం కచ్చితంగా భయపడే ఆస్కారం ఉంటుంది. ఎక్కడైనా ఇలాంటి వంతెనను చూశారా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో నిడివి 18 సెకన్ల పాటు ఉంది. ఇప్పటికి 18 వేల మందికిపైగా వీక్షించారు.
నెటిజన్లు లైక్ చేస్తూ పలు రకాలుగా స్పందిస్తున్నారు. మనదేశంలో మాత్రమే ఇలా జరుగుతుందంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఇదంతా ప్రకృతి ప్రసాదించిన వరం అని, దేవుడి లీల ఎన్ని రకాలో అంటూ కామెంట్లలో పేర్కొంటున్నారు.
कभी ऐसा फ्लाईओवर ब्रिज देखा हैं ………..😳🙄😳 pic.twitter.com/8OpU1yXHs2
— Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) March 15, 2023
Also read :
Kejriwal : ఢిల్లీని గెలవాలనుకుంటే ముందు ఆ పని చేయాలి.. మోదీకి కేజ్రీవాల్ సలహా!
Rajamouli: ఐదు లక్షల కోసం రాజమౌళి నన్ను అవమానించారు అంటూ సీనియర్ నటి కామెంట్