Telugu Flash News

Viral Video: పెళ్లిలో పన్నీర్‌ కోసం లొల్లి.. బుర్రలు పగిలేలా కొట్టుకున్నారు!

fight over not serving paneer in marriage

fight over not serving paneer in marriage

A viral video of not serving paneer in a marriage at uttar pradesh news : హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లిలో అలకలు సర్వ సాధారణమే. అయితే, అలకలు సీరియస్‌గా మారి పెళ్లిల్లు క్యాన్సిల్‌ చేసుకొనే దాకా వెళ్తేనే అసలు సమస్య మొదలవుతుంది. వివాహ తంతులో అవతలి వారికి ఎన్ని మర్యాదలు చేసినా కొందరు ఏదో ఒక వంక పెడుతుంటారు. కట్నకానుకల దగ్గర నుంచి భోజనాల దాకా అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. ఏది తక్కువైనా అవతలి వారు ఫీలై పోతుంటారు. ఒక్కోసారి రాద్దాంతం కూడా జరుగుతూ ఉంటుంది.

తాజాగా పెళ్లిలో పన్నీర్‌ కోసం గొడవ జరిగిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా అయ్యింది. మరీ చీప్‌గా పన్నీర్‌ కోసం కొట్టుకోవడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. అప్పటి దాకా ఆనందమయంగా మారిన పెళ్లి వేడుకలో గొడవ జరగడంతో కలకలం రేగింది. ఈ ఘటనతో ఏకంగా వధువు, వరుడి కుటుంబ సభ్యులు మధ్య కూడా రచ్చ జరగడం గమనార్హం. ఒకరినొకరు కొట్టుకొనే స్థాయికి గొడవ పెరిగిపోయింది. కొత్త దంపతులను దీవించి వెళ్దామని వచ్చిన వారికి ఈ ఘటనతో నీరుగారిపోయారు.

తిరిగి తిరిగి గొడవ తమకెక్కడ చుట్టుకుంటుందోనని బంధువులంతా పరుగులంకించుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో వెలుగుచూసింది. పెళ్లి సందర్భంగా భోజనాలు పెట్టడం సంప్రదాయం. ఇందులో కొన్ని రకాల కూరలు లేవని కొందరు పెళ్లికుమారుడి తరఫు వారు గొడవకు దిగారు. వధువు కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత బతిమాలినా వినకపోవడంతో మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది. అనంతరం కొట్టుకొనే స్థాయి వరకు వెళ్లింది.

వరుడు తరఫు వారు అమ్మాయి బంధువులపై దాడికి పాల్పడ్డారు. ఇరువర్గాలు కర్రలు, బెల్ట్‌లతో దాడి చేసుకున్నారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లి వేడుక పరిసరాల్లో జనం విపరీతంగా గుమిగూడారు. గొడవ ఎంత సేపటికీ సద్దుమణగకపోవడంతో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇరువర్గాలపై లాఠీ ఛార్జ్‌ చేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి నెట్టింట పోస్ట్‌ చేయడంతో ఇది వైరల్ అయ్యింది.

also read: 

తన భర్తే అనుకొని ఆమె చేసిన పని చూస్తే.. నవ్వు ఆపుకోలేరు!

kiraak RP : అమెరికాలోను చేప‌ల పులుసు ప్లాన్ చేస్తున్న కిరాక్ ఆర్పీ

Exit mobile version