Telugu Flash News

Viral Video : ఇదేందయ్యా ఇదీ.. ఎండిపోయిన చేపపై నీరు పోయగానే బతికేసింది!

viral videos

Viral Video : చేపలంటే చాలా మంది ఇష్టం. చేపల పులుసు, చేపల ఫ్రై.. ఇలా ఎన్నో రకాలుగా రుచికరంగా తయారు చేసుకొని తింటూ ఉంటారు. చేపలు సముద్రంలోనో, నీటిలోనో ఉంటే ఎలాంటి ప్రాణాపాయం ఉండదు. అయితే, అవి నీటి నుంచి బయట పడితే ప్రాణాలతో నిలవడం కష్టం. ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప ఒడ్డున పడి బతకడం అరుదుగా జరుగుతుంటుంది. కానీ, కొన్ని రకాల చేపల విషయంలో ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని నిపుణులు చెబుతారు.

తాజాగా ఓ చేప పూర్తిగా ఎండిపోయిన స్థితిలో కనిపించగా.. ఓ వ్యక్తి దానిపై నీళ్లు పోయగానే ఊపిరి పీల్చుకోవడం అద్భుతంగా దర్శనమిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అది ఎంతలా అంటే.. చేప తోక పట్టుకున్నా పలుకులుగా ఊడి వచ్చింది. అయితే, వాటర్‌ బాటిల్‌ తీసుకొని నీరు పోయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఏకంగా ఊపిరి పీల్చుకోవడం కనిపించింది. దీంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో బూడిద రంగులో ఉన్న ఓ చేప కనిపిస్తుంది. అది పూర్తిగా ఎండిపోయిన స్థితితో ఉంది. దాని తోక పట్టుకోవాలని ప్రయత్నించగా పెచ్చులు మాదిరిగా ఊడిపోయింది. ఈ పరిస్థితిలో ఏ చేప అయినా సరే బతికే అవకాశం దాదాపు ఉండదు. అయితే, ఆ వ్యక్తి చేపపై నీరు పోయడంతో ఆశ్చర్యకరంగా ఊపిరి వచ్చేస్తుంది. చనిపోయిందనుకున్న ఆ చేప చిత్రంగా నీరు తాగడాన్ని వీడియోలో చూడవచ్చు.

సకర్‌మౌత్ క్యాట్‌ఫిష్‌ జాతికి చెందిన ఈ చేపను ప్లెకో అని కూడా పిలుస్తారని తెలుస్తోంది. ఈ రకం చేపలు తీవ్రమైన వేడి, ఎండల్లోనూ ప్రాణాలతో ఉండగలవని నిపుణులు చెబుతున్నారు. వర్షం వచ్చే వరకూ లేదా, నీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చేదాకా బురదలోనే నెలల తరబడి జీవించేందుకు అవకాశం ఉంటుందట. ఈ తరహా చేపల పొత్తి కడుపులో కావాల్సినంత నీరు స్టాక్‌ పెట్టుకుంటాయట. అందువల్ల వల్ల ఒడ్డున కూడా 30 గంటలకు పైగా జీవించి ఉంటాయని చెబుతున్నారు. ఈ రకం చేపలు ఉత్తర, దక్షిణ అమెరికాలోని బురద చెరువుల్లో ఎక్కువగా కనిపిస్తాయంటున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

also read :

Pawan Kalyan : కొద్ది రోజుల పాటు రాజకీయాల‌కి బ్రేక్.. పూర్తిగా సినిమాల‌తోనే బిజీ..!

Deepveer: ఆ బాలీవుడ్ జంట విడాకులకి సిద్ధ‌మైందా.. ఆందోళ‌న చెందుతున్న ఫ్యాన్స్ 

Exit mobile version