Viral Video : సాధారణంగా కదులుతున్న వాహనాల్లోంచి దిగడం, ఎక్కడం లాంటివి చేయడం చాలా ప్రమాదకరం. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో కదిలే బస్సులు, రైళ్లలోనే కొందరు ఎక్కుతూ దిగుతుంటారు. ఇలా ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంటారు. అయితే, బస్సులు, రైళ్ల సంగతి అటుంచితే… ఆటోలో విన్యాసాలు చేయడం కూడా చూస్తుంటాం. తాజాగా వైరల్ అయిన ఓ వీడియోలో ఆటోలో వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
వైరల్ అయిన ఈ వీడియోలో.. ఓ ఆటో రోడ్డుపై ఓ మోస్తరు వేగంతో ప్రయాణిస్తోంది. రోడ్డుపై వెళ్తుండగానే వెనుక టైర్ ఒకటి పంక్చర్ అయ్యింది. దీంతో ఆటోలో కూర్చున్న వ్యక్తి ఓ సాహసం చేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఇందు కోసం ఆటో డ్రైవర్‌తో ఓ మాట చెప్పాడు. ఆటోను ఆపొద్దని సూచించాడు. కదులుతున్న ఆటోలోనే టైర్‌ను మార్చాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్నట్లే చేసేందుకు సిద్దమయ్యాడు.
స్పానర్ చేతబట్టుకొని టైర్ మార్చేందుకు రెడీ అయ్యాడు. ఇంకేముందీ.. ఆటోను డ్రైవర్ తన ట్యాలెంట్ ఉపయోగించి వాలుగా రోడ్డుపై అదే స్పీడుతో పోనివ్వసాగాడు. ఆటోకు సైడ్ ఉన్న కడ్డీలనను సాయం చేసుకొని స్పానర్ సాయంతో టైర్‌ను ఇప్పదీశాడు సదరు వ్యక్తి. టైరును తీసే క్రమంలో ఆటో ఓవైపు వాలి ఓ మోస్తరు వేగంగా ప్రయాణం చేస్తోంది. ఈ క్రమంలో ఏ చిన్న పొరపాటు జరిగినా రోడ్డు ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. దీంతో ఆటో డ్రైవర్ అత్యంత చాకచక్యంగా వాహనాన్ని నడపసాగాడు.
ఇంతలోనే అతడు టైర్‌ను ఇప్పేశాడు. వెనుకవైపు నుంచి మరో ఆటోలో అప్పటికేమాట్లాడి సిద్ధంగా పెట్టుకున్న వ్యక్తి మరో టైర్‌ను చేతికి అందించాడు. దీంతో పంక్చర్ అయిన టైర్‌ను తీసుకొని మరో టైర్ అతడికి ఇచ్చారు అటువైపు నుంచి ఆటోలో వచ్చిన వ్యక్తి. దీంతో వేరే టైర్‌ను మార్చేశాడు. ఈ దృశ్యాన్నంతా రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు వీడియో తీశారు. అది కాస్తా సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. వారెవా.. ఏం ట్యాలెంట్ గురూ.. కానీ ఇలా చేస్తే ప్రమాదాలు కూడా ఉంటాయి.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలా రోడ్డుపై స్టంట్లు చేయడం తప్పని మరికొందరు హితబోధ చేశారు.
Changing a tire on the road pic.twitter.com/KLUq0iOb6e
— Skills (@finetraitt) April 24, 2023
also read :
Supreme Court: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట.. అమరావతి భూ కుంభకోణంలో అరెస్టులు తప్పవా?