Telugu Flash News

Viral Video today : పెళ్లిలో డ్యాన్స్‌తో ఇరగదీసిన వధువు.. నెట్టింట వీడియో వైరల్‌!

viral videos

Viral Video today : ఇటీవల పెళ్లిళ్ల సందర్భంగా వధూ వరులు డ్యాన్స్‌ చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓ వధువు బుల్లెట్‌ బండి సాంగ్‌కు డ్యాన్స్‌ చేసిన వీడియో ఆ మధ్య తెగ వైరల్‌ అయ్యింది. లక్షలాదిగా ప్రజలు లైక్‌ చేశారు. ప్రస్తుతం ఎంగేజ్‌మెంట్‌, వివాహ వేడుకల్లో వధూవరులు డ్యాన్స్‌ చేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో వధువు ఎనర్జిటిక్‌గా డ్యాన్స్‌ చేయడంపై నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇన్‌ స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసిన ఈ వీడియోకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇప్పటికి ఈ వీడియోకు 60 లక్షల మందికిపైగా చూశారు. లక్షా 30వేల మందికిపైగా లైక్‌ చేశారు. పెళ్లి వేదికపై వధువు చేసిన డ్యాన్స్‌ చాలా ఎనర్జిటిక్‌గా ఉందంటూ యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.

పక్కనే ఉన్న వరుడు.. వధువు డ్యాన్స్‌ను చూస్తూ నవ్వుతూ ఉండిపోయాడు. తన నవ్వును కంట్రోల్‌ చేసుకోలేకపోయాడు. వరుడిని కూడా డ్యాన్స్‌ చేయాలని వధువు కోరింది. దీంతో తన వల్ల కాదని.. నువ్వు డ్యాన్స్‌ చేయాలంటూ ఆమెను ప్రోత్సహించడం కనిపించింది. నెల రోజుల కిందట ఇన్‌స్టా గ్రామ్‌లో ఈ వీడియో అప్‌లోడ్‌ చేశారు.

బ్యాగ్రౌండ్‌లో సాంగ్‌కు అదిరే స్టెప్పులతో డ్యాన్స్‌ చేసింది పెళ్లికుమార్తె. ఆమె ముందు ఒక చిన్నారి కూడా డ్యాన్స్‌తో అలరించింది. మెరిసే రెడ్‌ కలర్ లెహంగాతో పెళ్లికూతురు కనిపించింది. పెళ్లి కుమారుడు ఇందులో వైట్‌ సూట్‌, ప్యాంట్ ధరించి ఉన్నాడు. వధువు అదిరే స్టెప్పులను పెళ్లికుమారుడు చూస్తూ నవ్వుతూ ఎంజాయ్‌ చేశాడు. కామెంట్‌ సెక్షన్‌లో యూజర్లు అభినందనలతో ముంచెత్తారు. పెళ్లికుమార్తె చాలా ఉత్సాహంగా డ్యాన్స్‌ చేసిందని కామెంట్లు పెట్టారు. జీవితాంతం ఇలాగే ఆనందంగా గడపాలంటూ మరికొందరు యూజర్లు శుభాకాంక్షలు తెలిపారు.

also read :

Novak Djokovic : జకోవిచ్‌.. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే గెలిచి నిలిచాడు!

Union Budget 2023 : నేటి నుంచే పార్లమెంటు సమావేశాలు.. బడ్జెట్‌ షెడ్యూల్‌ పూర్తి వివరాలివే..

Exit mobile version