Viral video : ఇటీవల సోషల్ మీడియాలో మానవత్వం చాటుకుంటున్న వారి వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. ఇతరుల కోసం త్యాగాలు చేసే వారు నేటి కాలంలో తక్కువగా కనిపిస్తారు. అయితే, ప్రతిఫలం ఆశించకుండా త్యాగాలు చేయడం అనేది అందరికీ చేతకాదు.
ఈ నేపథ్యంలో ఇతరుల కోసం ఏమీ ఆశించకుండా సాయం చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. ఇలాంటిదే ఈ వీడియో. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ మహిళ.. తన జుట్టును ఇవ్వడానికి బార్బర్ షాప్‌కు వచ్చింది. అనంతరం బార్బర్ చేసిన పని ఇప్పుడు నెటిజన్లను భావోద్వేగానికి గురి చేస్తోంది.
క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ మహిళ.. ఇన్నాళ్లూ ప్రేమతో పెంచుకున్న తన జుట్టును ఇచ్చేసింది. అయితే, ఈ సమయంలో ఎమోషనల్ అయ్యింది. జుట్టు పోతోందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే, ఈ సమయంలో బార్బర్ ఆమెకు అండగా నిలిచాడు. కొండంత ధైర్యం చెప్పాడు. జుట్టును కత్తిరించడం పూర్తి కాగానే అతడు చేసిన పనికి ఇప్పుడు అందరూ అభినందిస్తున్నారు.
ఆ మహిళకు ట్రిమ్మర్‌తో తలపై జుట్టంతా తీసేసిన బార్బర్.. ఆమె తలను ప్రేమగా హత్తుకొని మద్దతు తెలిపాడు. ధైర్యంగా పోరాడాలని చెప్పాడు. అనంతరం తన జుట్టును సైతం బార్బర్ ట్రిమ్మర్‌తో తీసుసుకోవడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆ మహిళ భావోద్వేగానికి లోనైంది. తనకు మద్దతుగా నిలిచినందుకు అతనికి మనసారా థ్యాంక్స్ చెప్పింది.
మద్దతుగా నిలిచిన నెటిజన్లు..
ఇలా జరుగుతుందని ఊహించలేకపోయిన ఆ మహిళ.. తర్వాత అతన్ని హత్తుకొని ఏడ్చేసింది. గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ అనే ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్టు చేసిన ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా ఆదరిస్తున్నారు. కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న మహిళను, బార్బర్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇప్పటి వరకు పది లక్షలకుపైగా ఈ వీడియోకు వ్యూస్ వచ్చాయి. క్యాన్సర్‌తో ఆమె ఒంటరిగా పోరాడాల్సిన పని లేదని, తాము బాసటగా నిలుస్తామంటున్నారు నెటిజన్లు.
No one fights alone!
He shaves off his own hair in solidarity with a cancer patient. pic.twitter.com/1sjLKKjnHO
— GoodNewsMovement (@GoodNewsMVT) January 15, 2023
also read:
Kodi Pandalu : ఏపీలో విచ్చలవిడిగా కోడి పందాలు.. ఎన్నికోట్లు చేతులు మారాయంటే..!
నేనూ ప్రవాస భారతీయుడినే.. స్విట్జర్లాండ్‌లో మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు