Viral Video : చేసిన సాయం కొందరు మనుషులు మరిచిపోతుంటారు. అయితే మహాత్మా గాంధీ ఓ మాట అంటుండేవారు.. పొందిన లబ్ధిని జీవితాంతం గుర్తు పెట్టుకో.. చేసిన సాయాన్ని వెంటనే మర్చిపో.. అని. ఇలా చేసే మానవులు చాలా అరుదుగా ఉంటారు. అయితే, దీన్ని ఓ కొంగ నిరూపించింది. కృతజ్ఞతా భావాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంది.
ప్రమాదం గాయపడిన ఓ కొంగను ఆరిఫ్ అనే వ్యక్తి ఇంటికి తీసుకొచ్చి దానికి వైద్యం అందించి కాపాడాడు. సపర్యలు చేసి కంటికి రెప్పలా కాచుకున్నాడు. దీంతో ఆ కొంగ ఆరిఫ్ అంటే చాలా మక్కువ ఏర్పడింది. ఆరిఫ్, కొంగ మధ్య స్నేహం పెనవేసుకుపోయింది. అది ఎంతలా అంటే.. బైక్‌పై ఆరిఫ్ వెళ్తుంటే కొంగ అనుసరించేది. ఎక్కడికి వెళ్లినా ఆరిఫ్‌ను చూసేందుకు సాయంత్రానికి ఇంటికి చేరుకొనేది.
Viral Video : బైక్‌ను నీటిలో కూడా నడుపుతారా.. ఈ వీడియో చూసేయండి..
ఇందుకు సంబంధించిన వీడియోలు ఆ మధ్య వైరల్ కావడంతో నెటిజన్లు ఆరిఫ్‌ను మెచ్చుకున్నారు. అయితే, ఈ తతంగాన్ని చూసిన అటవీ శాఖ అధికారులు.. వన్యప్రాణులను ఇంట్లో పెట్టుకోవడం నేరమంటూ కొంగను స్వాధీనం చేసుకున్నారు. జూకు తరలించి బంధించారు. ఇది జరిగి నెలరోజులు దాటి పోయింది.
దీంతో నెలరోజులుగా తన మిత్రుడిని చూడకుండా ఉండటం కొంగ వల్ల కాలేదు. ఇక్కడ ఆరిఫ్ పరిస్థితి కూడా అంతే. దీంతో ఓసారి తన మిత్రుడిని చూసి వద్దామని జూకు వెళ్లాడు ఆరిఫ్. అక్కడ జంతు ప్రదర్శన శాలలో కొంగను ఎన్‌క్లోజర్ ప్రాంతంలో బంధించారు అటవీశాఖ సిబ్బంది. కొంగ బయటకు ఎగిరిపోకుండా కట్టుదిట్టమైన కంచె వేశారు.
ఇక ఆరిఫ్ కొంగ వద్దకు వెళ్లగానే అది గుర్తు పట్టేసింది. సంతోషంతో రెక్కలు ఊపుతూ అటూ ఇటూ గంతులేయసాగింది. కంచె అడ్డు లేకపోయి ఉంటే అది ఆరిఫ్ వద్దకు వచ్చేసేది అనిపించేలా ప్రవర్తించింది. అయితే, కొంగరు కౌగిలించుకొని ముద్దాడాలని ఆరిఫ్‌కు ఉన్నా అతడు ఇప్పుడేం చేయలేని పరిస్థితి ఏర్పడింది.
आज फिर एक बार फिर बेजुबान सारस अपने जीवन दाता मित्र आरिफ को देख तड़प उठा चहक उठा लेकिन दोनों मजबूर थे एक दूसरे को छु न सके pic.twitter.com/rzhJgZxpSJ
— कैलाश नाथ यादव (@kailashnathsp) April 11, 2023
ఈ దృశ్యాన్ని పక్కనున్న ఆరిఫ్ స్నేహితులు వీడియో తీశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. ఆరిఫ్‌కు, మూగజీవికి మధ్య పెనవేసుకున్న బంధాన్ని అటవీశాఖ అధికారులు మూర్కత్వంతో విడదీశారని, ఇది చాలా పాపం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంత క్రూరంగా ప్రవర్తించరాదని హితవు పలుకుతున్నారు. కొంగను జూకు తరలించిన నాటి నుంచి అది సరిగా ఆహారం తినడం లేదని, ఆరిఫ్‌పై బెంగ పెట్టుకుందంటూ కొందరు చెబుతున్నారు. ఆరిఫ్ ఫొటో చూసిన తర్వాత కొంగ ఆహారం తీసుకుంటోందని చెబుతున్నారు.