ఒక విచిత్రమైన కారణంతో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ (viral video) గా మారింది. ఇది ఒక దేవాలయం వద్ద ఏనుగు విగ్రహం కింద ఒక భక్తుడు ఇరుక్కున్నాడు. ప్రమాదవశాత్తూ ఆ భక్తుడు అక్కడ చిక్కుకుపోయాడు. ఈ వీడియోను ట్విట్టర్ యూజర్ నితిన్ షేర్ చేశారు , ఈ వీడియో కు 1 లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.
అయితే, ఇది మద్యప్రదేశ్, అమరకంటక్ లోని నర్మద మందిర్ లో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఇక్కడి వారి విశ్వాసం ఏంటంటే మీరు పాపాత్ములు అయితే అందులో ఇరుక్కుపోతారు అని. మంచివారు అయితే ఎంత లావు ఉన్న బయటికి వస్తారు అని అంటారు. అయితే ఇది ఒక మూడ నమ్మకం మాత్రమే అని, మీ లైఫ్ ని రిస్క్ చేయవద్దని కొందరు సూచిస్తున్నారు.
ఆలయం వద్ద ఉన్న ఏనుగు విగ్రహం కింద ఒక వ్యక్తి ఇరుక్కుపోయినట్లు వీడియో లో చూడవచ్చు. అతను అక్కడికి ఎలా వచ్చాడో ఖచ్చితంగా తెలియకపోయినా, ఇప్పుడు, అతను దాని నుండి బయటపడటానికి చాలా కష్టపడ్డాడు.
ఇరుకైన స్థలం నుండి బయట పడటానికి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, అతను విజయవంతం కాలేదు. ఆ సమయంలో ఆలయం వద్ద ఉన్న ఇతర భక్తులు కష్టాల్లో ఉన్న ఆ వ్యక్తికి సహాయం చేయడానికి చేతులు కలిపారు. ఈ నేపథ్యంలో చాలా మంది వ్యక్తులు విగ్రహం కింద నుండి బయటకు రావడానికి కొన్ని పద్ధతులను ఉపయోగించమని అతనికి సూచించడం మీరు వినవచ్చు. అతనికి సహాయం చేసేందుకు పూజారి కూడా దిగివచ్చినట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ వీడియోను రికార్డ్ చేశాడు.
అయితే, వీడియోలో ఆ భక్తుడు ఎలా బయటికి వచ్చాడో చూపించలేదు. ఇలాంటి ఘటనలు ఇది వరకు కూడా చాలా జరిగాయి అని నెటిజెన్ లు చెప్తున్నారు.
“మితిమీరిన భక్తి ఆరోగ్యానికి హానికరం” అని వీడియో కి క్యాప్షన్ ఇచ్చారు. ఇకనైనా ఇలాంటివి చేసే ముందు చేయగలరా లేదా అని ఆలోచించి చేయండి.
Any kind of excessive bhakti is injurious to health 😮 pic.twitter.com/mqQ7IQwcij
— ηᎥ†Ꭵղ (@nkk_123) December 4, 2022
గతంలో ఒక మహిళా కూడా ఇలానే చేసి ఇరుక్కు పోయింది. అయితే చాలా కష్టపడి ఆమె బయటికి లాగారు. ఈ వీడియో కూడా చూసేయండి మరి..