Viral video : ఇటీవల బైకులపై స్టంట్లు చేసే యువత పెరిగిపోయారు. ఇంట్లో తల్లిదండ్రులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా పెడచెవిన పెడుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేపించి పేరెంట్స్‌తో బైకులు కొనిపించుకొని రోడ్లపైకి వస్తున్నారు. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళితే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ ప్రమాదాలు కలిగేలా స్టంట్లు చేయడంతోనే అసలు సమస్య వచ్చి పడుతోంది. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీ జాతీయ రహదారిపై యువకులు హల్‌చల్ చేశారు. మూడు బైకుల్లో ఏకంగా 14 మంది ప్రయాణిస్తూ ప్రమాదకర స్టంట్స్ చేశారు. ఈ ఘటన వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు యువకులు. ఒకే ద్విచక్ర వాహనంపై ఏకంగా ఆరుగురు యువకులు ఎక్కారు. మరో రెండు బైకులపై నలుగురు చొప్పున కూర్చున్నారు. దీంతోపాటు బైక్‌ను రోడ్డపై అటూ ఇటూ తిప్పుతూ డ్రైవ్ చేశారు. బైకుల స్టంట్లు చూసి రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు షాక్ అయ్యారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఈ పరిణామంతో యూపీలో ఒక్కసారిగా అలజడి రేగింది. యువకుల ప్రాణాల మీదకు తెచ్చుకొనేలా ఆ విన్యాసాలేంటి అంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించరాదని పోలీసులను కోరుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాలని చెబుతున్నారు.
పోలీసుల అలర్ట్.. కేసు నమోదు
యువకుల బైక్ స్టంట్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో ఉత్తర ప్రదేశ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు ఆరా తీశారు. అనంతరం బైక్ స్టంట్లు చేసిన యువకులపై కేసులు నమోదు చేశారు. ఘటన జరిగిన తీరుపై యాక్షన్ తీసుకున్నారు. యువత ఇలాంటి ప్రమాదకర స్టంట్లు రోడ్లపై చేయరాదని కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
#viralvdoz#WATCH: 14 men on three bikes booked for performing stunts in UP #Bareilly #UttarPradesh #Stunts #breaking #viralvideo pic.twitter.com/fz5uhSp8Am
— ViralVdoz (@viralvdoz) January 11, 2023
also read:
Ambati Rambabu : ఏపీ మంత్రి అంబటిపై కోర్టు ఆగ్రహం.. కేసు నమోదుకు ఆదేశం.. ఎందుకంటే..!
Telangana New CS : తెలంగాణ సీఎస్‌గా శాంతి కుమారి.. ఆమె ప్రొఫైల్ తెలుసా?