Homeviral newsViral Video: బీరుతో హల్దీ ఫంక్షన్‌.. ఇదేం పిచ్చి నాయనలారా?

Viral Video: బీరుతో హల్దీ ఫంక్షన్‌.. ఇదేం పిచ్చి నాయనలారా?

Telugu Flash News

Viral Video: వివాహాలు, ప్రీ వెడ్డింగ్‌ షూట్లు, ఇతర ఫంక్షన్లలో కెమెరా ముందు పోజులివ్వడం అందరూ చేసే పనే. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులంతా కలిసి ఫంక్షన్లలో వీడియోలు, ఫొటోలకు ప్రత్యేకంగా ముస్తాబు అవుతుంటారు. ఈ క్రమంలో మరపురాని మధురానుభూతులుగా మిగుల్చుకొనేందుకు కొంటె చేష్టలకు పాల్పడుతుంటారు. ఇలాంటి సరదా సన్నివేశాలు పెళ్లిళ్లలో అయితే కామన్‌గానే జరుగుతుంటాయి. తాజాగా వైరల్‌ అయిన ఓ వీడియోలో అబ్బాయిలు ఇలాంటి పనే చేశారు.

ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. వివాహం ఎంతో గొప్ప అనుభూతిని ఇస్తుంది. అందుకే పెళ్లిని వైభవంగా చేసుకుంటూ ఉంటారు. కలకాలం గుర్తుండిపోయేలా పెళ్లి చేసుకోవడం ఇప్పుడు చాలా జంటలు చేసే పనే. ఈ క్రమంలోనే పెళ్లి పత్రికలు కాస్త వెరైటీగా ప్రింట్‌ చేయించడం, ఊరేగింపులో పదనిసలు, పెళ్లిలోనూ చిత్రాతి విచిత్రాలు చూస్తుంటాం. ఇక పెళ్లి అంటే హల్దీ ఫంక్షన్‌ కామన్‌. కొన్ని సీన్లు, వీడియోలో నెట్టింట వైరల్‌ అవుతుంటాయి.

ఇటీవల తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా హల్దీ ఫంక్షన్ కాస్త డిఫరెంట్‌గా నిర్వహించారు. ఇందుకు సంబంంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాడుర్ మండలం ఐతోల్ గ్రామంలో ఓ పెళ్లికి ముందు హల్దీ నిర్వహించారు. అత్యంత పవిత్రంగా, గౌరవప్రదంగా భావించే ఈ కార్యక్రమంలో బీరు పొంగించారు. మంగళ స్నానాల్లో పసుపు నీటికి బదులుగా బీరును పోశారు.

దీంతో ఇది వివాదానికి దారి తీసింది. వేదమంత్రాలతో రెండు కుటుంబాలను రెండు మనసులను ఏకం చేస్తూ నూరేళ్ల జీవితానికి వేదిక అయ్యే ఈ పెళ్లి కార్యక్రమం.. ఇలా వింత పోకడలకు దారి తీయడం అశుభమని చెబుతున్నారు. మన ఆచారాలు రోజురోజుకూ ఇలా భ్రస్టు పట్టిస్తున్నారంటూ నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్ల నుంచి కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

Read Also : Viral Video : బతుకు పోరాటం.. పులితో పరుగు పోరులో గెలిచేసిన జింక పిల్ల!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News