అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ వేడుకకు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా హాజరయ్యారు. అయితే హీరో ధనుష్ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి మధ్య హీరో ధనుష్ ఉండగా , ఈ ఫోటో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన కెప్టెన్ మిల్లర్ తెలుగులో జనవరి 26న విడుదల కానుంది. చిరు విశ్వంభర చిత్రంతో బిజీగా ఉండగా, రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ గేమ్ ఛేంజర్‌లో కనిపించనున్నారు.