Vikram: ఏ పాత్రకైన ప్రాణం పోయాలంటే అది కొందరి నటులకే సాధ్యమవుతుంది. అలాంటి నటులలో విక్రమ్ ఒకరు. ‘శివ పుత్రుడు’ సినిమా తర్వాత స్టార్ అయిపోయిన విక్రమ్ ‘అపరిచితుడు’ చిత్రంతో తన స్టార్‌డమ్ అమాంతం పెంచేసుకున్నాడు.
ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ఆయన నటించిన పీఎస్2 చిత్రం విడుదలకు సిద్ధం కాగా.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో తాను ఎలాంటి పరిస్థితులను దాటుకొని నటుడిగా ఎదిగాడో చెప్పుకొచ్చాడు.
12 ఏళ్ల వయస్సులో తన ఫ్రెండ్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా అనుకోకుండా జరిగిన ప్రమాదంలో తన కుడి కాలు.. మోకాలి నుంచి చీలమండ వరకు పూర్తిగా నుజ్జ నుజ్జు అయిందట .
రాయపేట హాస్పిటల్ డాక్టర్స్.. విక్రమ్ కాలును తొలగించాలని సూచించడంతో దానికి విక్రమ్ తల్లి ఏ మాత్రం ఒప్పుకోలేదట. ఆ టైమ్‌లో కోలుకునే అవకాశం 2 శాతం మాత్రమే కాగా, మూడేళ్ల పాటు వీల్ చైర్ కే పరిమితం అయ్యాడు.
తనని తాను కాపాడుకునేందుకు విక్రమ్ మొత్త 23 సర్జరీలు కూడా చేయించుకున్నాడు. ఇక ట్రీట్‌మెంట్ పూర్తయ్యాక కూడా ఇన్‌ఫెక్షన్ల కారణంగా విక్రమ్ రెగ్యులర్‌గా హాస్పిటల్‌కు వెళ్లాల్సి వచ్చేదనే విషయాన్ని చాలా సార్లు షేర్ చేసుకున్నాడు.
also read:
Karnataka : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ వింత పరిస్థితులు.. అక్కడ నేత మారితే పార్టీకి నష్టమే!