Divorce: ఈ మధ్య కాలంలో కొందరు సెలబ్రిటీలు అభిమానులకి ఊహించని షాక్‌లు ఇచ్చారు. అన్యోన్యంగా ఉండే జంటలు మనస్పర్ధల వలన విడాకులు తీసుకున్నారు. సమంత, అమీర్ ఖాన్, ధనుష్ వంటివారు విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఇదే జాబితాలో స్టార్ హీరో విజయ్ చేరినట్టు తెలుస్తుంది. ఇలయ దళపతి విజయ్ విజయ్ నటించిన వారసుడు చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుండగా, నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జనవరి 11న వారసుడు రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
ఒకవైపు వారసుడు మూవీ హంగామా నడుస్తుండగా, మరోవైపు విజయ్ గురించి ఒక షాకింగ్ రూమర్ తమిళనాడుతో పాటు సౌత్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. హీరో విజయ్ తన సతీమణి సంగీత నుంచి విడాకులు తీసుకుని విడిపోయేందుకు సిద్ధమయ్యారు అంటూ ప్రచారం మొదలైంది. వైల్డ్ ఫైర్ లాగా ఈ రూమర్స్ వ్యాపించాయి. దీనితో విజయ్ అభిమానులు ఆందోళనలో ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోవల్సి వచ్చింది అని లెక్కలు వేస్తున్న సమయంలో విజయ్ సన్నిహిత వర్గాలు ఈ పుకార్లపై స్పందించారు. విజయ్, సంగీత గురించి వచ్చిన ఈ న్యూస్ ఫేక్ అని తేల్చేశారు.. అసలు ఈ రూమర్లు ఎందుకు మొదలయ్యాయో కూడా అర్థం కావడం లేదు. ఈ పుకార్లు పూర్తిగా అవాస్తవం అని తేల్చేశారు.
ఇటీవల చెన్నైలో వారసుడు ప్రీ రిలీజ్ వేడుక జరగగా, ఈ కార్యక్రమానికి విజయ్ భార్య సంగీత హాజరు కాలేదు. అలాగే దర్శకుడు అట్లీ సతీమణి సీమంతం వేడుకలో కూడా సంగీత కనిపించలేదు. దీనితో విజయ్, సంగీత మధ్య విభేదాలు మొదలయ్యాయా.. వీరిద్దరూ దూరంగా ఉంటున్నారా అనే ప్రచారం జోరందుకుంది. అయితే ఇవి పూర్తిగా అసత్యమైన వార్తలు అని తేలింది. తన పిల్లలతో సంగీత టూర్‌కి వెళ్లిన కారణంగానే హాజరు కాలేకపోయిందని చెబుతున్నారు. కాగా, విజయ్, సంగీత 1999లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి జాసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా సంతానం