HomecinemaVijay deverakonda : 'ఫ్యామిలీ స్టార్' గా విజయ్ దేవరకొండ ?

Vijay deverakonda : ‘ఫ్యామిలీ స్టార్’ గా విజయ్ దేవరకొండ ?

Telugu Flash News

Vijay deverakonda : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా టాలీవుడ్ కి వచ్చి.. అతి తక్కువ సమయంలో స్టార్ గా ఎదిగిన క్రేజీ కుర్రాళ్లలో విజయ్ దేవరకొండ ఒకరు. హీరోగా భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. తన రేంజ్ ని భారీగా పెంచుకున్నాడు.

ఇదే స్ఫూర్తితో గతేడాది పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’తో ముందుకు వచ్చాడు. కానీ, ఇది అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుస ప్రాజెక్టులతో కష్టపడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ‘ఖుషి’ అనే ప్రేమకథా చిత్రం చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమా షూటింగ్‌లో ఉండగానే తన 12వ చిత్రాన్ని ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేస్తున్నట్టు ప్రకటించాడు.

అంతేకాదు ఆ వెంటనే పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తన 13వ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. దిల్ రాజు నిర్మించనున్న ప్రాజెక్ట్ రెండు రోజుల క్రితమే అఫీషియల్ గా లాంచ్ అయింది. ఈ మేరకు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్‌పై ఓ ఆసక్తికర వార్త వైరల్‌గా మారింది.

‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్-పరశురామ్ కాంబోలో వస్తున్న ఈ సినిమా కూడా కుటుంబ కథా చిత్రంగా ఉండనుంది. దీంతో ఈ సినిమాకు డీసెంట్ టైటిల్ పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే నిర్మాత దిల్ రాజు దీని కోసం ఫిలిం ఛాంబర్ లో రెండు పేర్లను రిజిస్టర్ చేసిన సంగతి తెలిసింది. అందులో ఒకటి ‘ఫ్యామిలీ స్టార్’ కాగా మరొకటి ‘కుటుంబ రావు’. ఈ రెండింటిలో ఒకటి ఫిక్స్ అవుతుంది. ఫుల్ యూత్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ కి ఈ రెండు టైటిల్స్ కొత్తగా ఉంటాయని చెప్పొచ్చు.

హిట్ కాంబినేషన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ డీసెంట్ రోల్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇది పూర్తయిన వెంటనే షూట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిసింది.

read more :

-Advertisement-

Bronze Age sword : తవ్వకాల్లో 3,000 యేళ్ళ నాటి అష్టభుజి కత్తి లభ్యం.. ఇప్పటికీ మెరుస్తూనే.. ఎక్కడంటే?

donald trump : రెస్టారెంట్‌లో బిల్లు కట్టకుండానే డొనాల్డ్ ట్రంప్ వెళ్లిపోయారన్న వార్తల్లో నిజమెంత ?

Amarnath Murder Case | ఎలాంటి రాజకీయ కోణం లేదు : ఎస్పీ వకుల్ జిందాల్

నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం : ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

anasuya hot in bikini : లేటు వయసులో ఘాటు అందాలు

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News