ఇటీవలే విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ చిత్రం పూర్తి చేశాడు. ఈ సినిమాతో పాటు పూరి డైరక్షన్ లోనే జనగణమన కూడా చేయనున్నాడు విజయ్.
జాన్వీ కపూర్ ఈ చిత్రంలో తన అరంగేట్రం చేయవలసి ఉంది కానీ ఇప్పుడు, కియారా అద్వానీని కథానాయికగా సంప్రదించినట్లు తెలుస్తుంది. ఈ సినిమా లో కియారా అయితేనే బాగుంటుందని చిత్ర యూనిట్ అంతా అనుకున్నారు.
కియారా ఇదివరకే భరత్ అనే నేను లో మహేష్ బాబు, వినయ విదేయ రామ లో రామ్ చరణ్ తో నటించింది. టాలీవుడ్ లో కూడా తనకి మంచి గుర్తింపు ఉండటం తో మూవీ రీచ్ ఎక్కువగా ఉంటుందని బావిస్తున్నారు.
ఎటువంటి నిర్ధారణ లేనప్పటికీ, విజయ్‌తో ఎవరు రొమాన్స్ చేస్తారనేది నిజంగా ఆసక్తికరంగా మారింది. ఇద్దరు హీరోయిన్లు చాలా ఫేమస్ మరియు విజయ్ దేవరకొండ పక్కన అద్భుతంగా కనిపిస్తారు.