HomecinemaVijay Devarakonda Rashmika: విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక జంట‌పై క్రేజీ రూమ‌ర్స్.. నిక్‌నేమ్ కూడా పెట్టేశారుగా..!

Vijay Devarakonda Rashmika: విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక జంట‌పై క్రేజీ రూమ‌ర్స్.. నిక్‌నేమ్ కూడా పెట్టేశారుగా..!

Telugu Flash News

Vijay Devarakonda Rashmika: టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవ‌ర‌కొండ‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక‌కి సంబంధించి త‌ర‌చు అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటాయి. వీళ్లిద్దరు కలిసి ఇప్పటికే రెండు సినిమాల్లో నటించారు. గీత గోవిందం,డియర్ కామ్రేడ్ చిత్రాల‌లో న‌టించ‌గా, గీతా గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ కాగా, డియ‌ర్ కామ్రేడ్ ఫ్లాఫ్ అయింది. అయితే సినిమాల సంగ‌తి ఎలా ఉన్నా కూడా వీరిద్దరూ నిజజీవితంలో ప్రేమించుకుంటున్నారు అంటూ వార్తలు వ‌స్తూనే ఉన్నాయి.. ఎప్పటికప్పుడు తాము కేవలం ప్రెండ్స్ మి మాత్రమే అని వీరు చెబుతూనే ఉన్నప్పటికీ వీరి మధ్య ఏదో ఉందని అభిమానులు మాత్రం చెబుతూనే ఉంటారు.

న్యూ ఇయర్ కి కూడా ఫారిన్ కి కలిసి వెళ్లి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవ‌డంతో వీరు కేవలం స్నేహితులు మాత్రమే కాదు అంటూ పుకార్లు మళ్ళి జోరు అందుకున్నాయి. ఇద్దరూ వేరువేరుగా ఉన్న ఫోటోలను సైతం మెర్జ్ చేసి మరి సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేస్తున్నారు.మ‌రోవైపు ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియోలో పాల్గొంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పింది. అలాగే లైవ్ లో ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది రష్మిక. అయితే ఆ లైవ్ వీడియోలో ఓ నెటిజన్ మీ వయసు ఎంత అని అడిగితే దానికి రష్మిక సమాధానం చెబుతుండగా.. పక్క నుంచి ఎవరో మగ వ్యక్తి వాయిస్ వినిపించింది.

ఆ వాయిస్ కొంచెం అటు ఇటుగా విజయ్ దేవరకొండ వాయిస్ లానే ఉంద‌ని, దీంతో రష్మిక విజయ్ తోనే ఉందని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. వీరిద్దరూ ఇంకా ప్రేమలోనే ఉన్నారని, సీక్రెట్ గా వెకేషన్స్ కు వెళ్తున్నారని అంటున్నారు. ఇక ఈ విషయం ప్రక్కన పెడితే వీళ్లిద్దరి జంటకు అభిమానులు ఓ నిక్ నేమ్ పెట్టుకున్నారు. అదేమిటంటే…ViRash.సెలబ్రిటీల రిలేషన్‌షిప్‌, పెళ్లిళ్లలకు ఇలా ఇద్దరి పేర్లు కలిపి పెట్టడం కామనైపోయింది కదా. అలా విజయ్‌, రష్మిక జోడీని విరోష్‌ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈనిక్ నేమ్ అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకుంటుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News