FIFA World Cup 2022 Final : ఫిఫా వరల్డ్ కప్‌ఫైనల్ ఉత్కంఠతో నిండిపోయింది. ఆదిలోనే సత్తా చాటిన అర్జెంటీనా.. ప్రథమార్థంలో రెండు గోల్స్ చేసి పైచేయి సాధించింది. ఈ దశలో కొంత తడబడిన డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ అస్సలు పోటీపడలేకపోయింది.
దీంతో ఆట మొత్తం ఏకపక్షంగా సాగిందని, బోరింగ్‌గా ఉందని అభిమానులు భావించారు. అయితే చివర్లో ఫ్రాన్స్ కోలుకుంది. 80వ నిమిషంలో ఎంబాప్పే పెనాల్టీ కిక్‌ను గోల్ చేశాడు. మరుసటి నిమిషంలో మరో గోల్ చేసి స్కోర్‌లను సమం చేశాడు. ఫ్రాన్స్ తరఫున అతనే నాలుగు గోల్స్ చేయడం గమనార్హం.
మెస్సీ సాధించాడు..
అదనపు సమయంలోనూ స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ పెనాల్టీ కిక్‌ల వరకు వెళ్లింది. ఈ సమయంలో, Mbappe ఫ్రాన్స్‌కు మొదటి గోల్ చేశాడు. అర్జెంటీనా తరుపున ముందుకు వచ్చిన మెస్సీ.. ఎప్పటిలాగే తన మేధాశక్తిని ఉపయోగించి గోల్ చేశాడు. తర్వాత ఫ్రాన్స్ గోల్ చేయకపోగా.. అర్జెంటీనా గోల్ చేసింది. మూడోసారి కూడా అదే కథ రిపీట్ అయింది. తర్వాతి అవకాశంలో మౌని ఫ్రాన్స్‌కు గోల్ అందించాడు. అర్జెంటీనా తరఫున మోంటెల్ కూడా గోల్ చేయడంతో అర్జెంటీనా 4-2తో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఎట్టకేలకు మెస్సీ తన కలను నెరవేర్చుకున్నాడు. ప్రపంచకప్‌ను ముద్దాడాడు.