Viral Video : అడవిలో ఒక జంతువును మరో జంతువు వేటాడటం కామనే. ఈ క్రమంలోనే జింకను పులి వేటాడటం చూస్తుంటాం. సింహాలు సైతం అనేక బలహీనమైన జంతువులను వేటాడి వెంటాడి చంపేసి తినేస్తుంటాయి. ఇది సృష్టిలో అత్యంత సహజంగా జరిగేదే. ఈ క్రమంలో ఓ జంతువుది ఆకలితో పోరాటం అయితే, మరో జంతువుది బతుకు పోరాటం. ఈ పోరులో ఎవరు గెలిచారనేది కూడా ముఖ్యమైన అంశమే.
తాజాగా వైరల్ అయిన ఓ వీడియోలో బక్క ప్రాణి అయిన జింక పిల్లపై పులి కన్ను పడింది. ఆకలితో ఎప్పుడెప్పుడు పట్టుకొని తినేద్దామా అని పులి ఎదురు చూస్తోంది. అయితే, దేహం బలంగా ఉన్నప్పటికీ తెలివి ప్రదర్శించాలని పెద్దలు చెబుతుంటారు. శారీరక బలం ముందు బుద్ధిబలం చాలా సార్లు గెలుస్తుంది. ఈ వీడియోలో అదే కనిపిస్తోంది. జింక పిల్లను వేటాడటానికి వచ్చిన పెద్దపులికి చేదు అనుభవం ఎదురైంది. పెద్దపులిని జింక పిల్ల ఎలా బోల్తా కొట్టించిందో ఈ వీడియోలో చూడొచ్చు.
అటవీ ప్రాంతంలో జింకలు కొన్ని మేతకు వచ్చాయి. పచ్చని గడ్డిని తింటున్నాయి. ఇంతలో పక్కనే ఉన్న గడ్డి పొదల్లో నుంచి ఓ పెద్ద పులి అటువైపు వచ్చింది. జింకల్లో ఏదో ఒకటి దొరకబుచ్చుకొని తినేద్దాం అని ప్లాన్ చేసి మాటు వేసింది. జింకలు కాస్త ఆదమరిచి ఉన్న సమయంలో వాటిపై అటాక్ చేసింది. అప్రమత్తమైన జింకలు తలోదిక్కు పరుగులంకించుకున్నాయి. ఓ జింక పులినుంచి తప్పించుకునే క్రమంలో పక్కనే ఉన్న చెరువులోకి దూకాల్సి వచ్చింది.
అయితే, పులి కూడా జింకకోసం నీటిలో దూకేసింది. జింకపై దాడి చేయాలని ప్రయత్నించింది. అయితే, జింక తెలివిని ప్రదర్శించి పులికి కనిపించకుండా నీటిలోకి మునిగిపోయి దూరంగా వెళ్లి పైకి తేలింది. దాంతోపాటు వాయువేగంతో నీటిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని అడవిలోకి జంప్ అయిపోయింది. జింక మెరుపు వేగాన్ని అందుకోలేకపోయిన పులి.. ఎలాగోలా ఈదుకుంటూ అటూ ఇటూ చూసుకుంటూ ఒడ్డుకు చేరింది. నెటిజన్లంతా ‘బెటర్ లక్ నెక్ట్స్ టైమ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read Also : pavitra naresh : త్వరలోనే మా పెళ్లి.. మా కోసమే సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందన్న నరేష్