HomecinemaVenu Swamy : తార‌క‌ర‌త్న మ‌ర‌ణంతో తెర‌పైకి వేణుస్వామి వీడియో.. నెట్టింట వైరల్ !

Venu Swamy : తార‌క‌ర‌త్న మ‌ర‌ణంతో తెర‌పైకి వేణుస్వామి వీడియో.. నెట్టింట వైరల్ !

Telugu Flash News

Venu Swamy : సెల‌బ్రిటీల గురించి జ్యోతిష్యాలు చెబుతూ వార్త‌ల‌లో నిలుస్తూ ఉండే వ్యక్తి వేణుస్వామి. ఎప్పుడైతే స‌మంత‌, నాగ చైత‌న్య విడిపోతార‌ని చెప్పారో అప్ప‌టి నుండి ఆయ‌న‌కు ఫుల్ క్రేజ్ పెరిగింది. రెండు నెలల క్రితం వేణు స్వామి ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌గా ఇందులో యంగ్ హీరో, హీరోయిన్ త్వ‌ర‌లోనే చనిపోతారు అని చెప్పుకొచ్చాడు. వారి వయసు 45 ఏళ్ల లోపే ఉంటుంది. మీరు 90 సంవత్సరాల వారు చనిపోతే.. వయసు పైబడి చనిపోయారు అంటారు కాబ‌ట్టి నేను ఇప్పుడు చెబుతున్నా వారు యంగ్ జ‌న‌రేష‌న్ వారే అని అన్నాడు.

అంతేకాదు హీరో వృశ్చిక లేదా మిథున రాశికి చెందిన వాడని, హీరోయిన్ మేష రాశికి చెందినదని చెప్పాడు వేణు స్వామి.అయితే ఆయ‌న చెప్పిన‌ట్టుగానే 45 ఏళ్ల‌లోపు ఉన్న తార‌క‌ర‌త్న మ‌ర‌ణించ‌డంతో త్వ‌ర‌లో హీరోయిన్ కూడా మ‌ర‌ణిస్తుందా అని నెటిజ‌న్స్ టెన్ష‌న్ ప‌డుతున్నారు.

అయితే అత‌ను 2027-28లో చ‌నిపోతారు అని చెప్పుకు రాగా, 2023లో అయితే తార‌క‌ర‌త్న వంటి యువ హీరో క‌న్నుమూసాడు. నేచుర‌ల్ డెత్ లేదా ఆత్మ‌హ‌త్య చేసుకొని చ‌నిపోతార‌ని వేణు స్వామి ఆ రోజు ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తార‌క‌రత్న మ‌ర‌ణం త‌ర్వాత వేణుస్వామి వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.

also read :

TSRTC : వేసవి కాలంలో చల్లటి కబురు.. టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు వచ్చేస్తున్నాయ్‌!

Karnataka : ఐఏఎస్‌ వర్సెస్‌ ఐపీఎస్.. కర్ణాటకలో వీధికెక్కి ఇద్దరు మహిళా అధికారుల పోరు

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News