Telugu Flash News

Venu Madhav: వేణు మాధ‌వ్ సంపాదించిన కోట్ల ఆస్తులు ఏమ‌య్యాయి… ఆయ‌న త‌ల్లి అద్దె ఇంట్లో ఉండడానికి కారణం?

telugu comedian venu madhav

Venu Madhav: టాలీవుడ్ పాపుల‌ర్ క‌మెడీయ‌న్స్ లో వేణు మాధ‌వ్ ఒక‌రు. అతి త‌క్కువ స‌మ‌యంలో మంచి క‌మెడీయ‌న్‌గా గుర్తింపు తెచ్చుకున్న వేణు మాధ‌వ్ ఎన్నో పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించాడు. అయితే వేణు మాధ‌వ్ చిన్న వ‌య‌స్సులోనే అనారోగ్యంతో క‌న్నుమూసాడు.

అయితే ఫామ్‌లో ఉన్న స‌మ‌యంలో వేణు మాధ‌వ్ చాలా ఆస్తులు సంపాదించాడు. చ‌నిపోయే నాటికి కూడా చాలానే ఉన్న‌ట్టు తెలిసింది. అయితే అన్ని ఆస్తులు ఉన్న‌ప్ప‌టికీ వేణు మాధ‌వ్ త‌ల్లి అద్దె ఇంట్లో ఉంటుంది.

రీసెంట్ గా ఓ మీడియాతో మాట్లాడిన వేణుమాధవ్ తల్లి సావిత్రమ్మ.. వేణుకి ఒక అలవాటు ఉంది. ఎప్పుడు ఏ జబ్బు చేసినా మందులు వేసుకునేవాడు కాదు. తలనొప్పి వచ్చినా టాబ్లెట్ వేసుకునే అలవాటు ఆయనకి లేదు.. అదే అతని కొంపముంచింది అన్నారు సావిత్రమ్మ.

కూతురు పెళ్లి టెన్షన్ తో ఒక కొడుకు చనిపోయాడు. అతను చనిపోయిన నెలా పదిహేను రోజుల్లోనే వేణుమాధవ్ కూడా చనిపోయాడు. వేణు మాధవ్ చనిపోయేనాటికే చాలా ఆస్తులు ఉన్నాయని.. ఏడెనిమిది ఫ్లాట్ లతో పాటు దాదాపు 20 కోట్లకి పైగా ఆస్తులు ఉన్నాయని చెప్పిన ఆమె తల్లిగా నాకు ఉపయోగం ఏమీలేవు.. నేను మాత్రం మరో కొడుకును చూసుకుంటూ.. అద్దె ఇంట్లో కాలం వెల్లదీస్తున్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు.

also read : 

ముఖంపై మొటిమలా? వంటింట్లో లభించే వస్తువులతో ఇలా పోగొట్టుకోండి!

రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలా.. ఈ ఫుడ్స్‌ తింటే తిరుగుండదు!

ఫేస్‌ ఆయిల్స్‌తో నిగనిగలాడే చర్మ సౌందర్యం.. ఎలా వాడాలో తెలుసుకోండి..

 

Exit mobile version