HomecinemaVennela Kishore: వెన్నెల కిషోర్ ఇంట్లో గుట్ట‌లుగా ఉన్న 2000 వేల నోట్లు .. ఫొటో లీక్ చేసిన మంచు విష్ణు

Vennela Kishore: వెన్నెల కిషోర్ ఇంట్లో గుట్ట‌లుగా ఉన్న 2000 వేల నోట్లు .. ఫొటో లీక్ చేసిన మంచు విష్ణు

Telugu Flash News

Vennela Kishore:రీసెంట్‌గా ఆర్‌బీఐ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసి అంద‌రికి షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. రూ.2వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక ప్రకటన చేయ‌డంతో ఇప్పుడు అంద‌రు ఇదే విష‌యం గురించి ముచ్చ‌టించుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈ టాపిక్ ట్రెండింగ్ కూడా అయింది. 2 వేల రూపాయల నోటు చెలామణిలో ఉండదంటూ భారత ప్రభుత్వం ప్రకటించడం సంపన్న వర్గాలను చ‌లా ఆందోళ‌న‌కు గురి చేస్తుంది.

గతంలో నోట్ల రద్దు తర్వాత 2 వేల రూపాయల నోటును కొత్తగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టడం మ‌నంద‌రికి తెలిసిన విష‌య‌మే. అయితే ఈ నోటుపై సాధారణ ప్రజల నుంచి అప్ప‌ట్లో తీవ్ర అసంతృప్తి రావడం జ‌రిగింది. అయితే పలు పార్టీలు ఈ నోటును నిషేధించాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు. ఈ క్రమంలో ఆర్‌బీఐ రెండు వేల రూపాయ‌ల నోటుని ర‌ద్దు చేస్తూ సెప్టెంబ‌ర్ వ‌ర‌కు ఈ నోట్ల‌ని బ్యాంకులో మార్చుకోవ‌చ్చ‌ని తెలిపింది.

2023, సెప్టెంబర్ 30వ తేదీ తర్వాత రెండు వేల నోటు అనేది చిత్తు కాగితంగా పరిగణిస్తారు.. ప్రస్తుతం భారతదేశం వ్యాప్తంగా 3.62 లక్షల కోట్ల రూపాయల విలువైన 2 వేల నోట్లు చెలామణిలో ఉండ‌గా, ఇప్పుడు ఈ నోట్లు అన్నింటినీ గడువులోగా బ్యాంకుల్లో త‌ప్ప‌క మార్చుకోవాలి. ఆ త‌ర్వాత వాటిని ఎలాంటి వాల్యూ ఉండ‌దు. అయితే తాజాగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కమెడియన్ వెన్నెల కిశోర్.. ఇంట్లో రెండువేల నోట్ల కట్టలు గుట్టులుగా ఉన్నాయ‌నే వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఒక ఫొటో కూడా లీక్ కావ‌డంతో అంద‌రు ఆశ్చ‌ర్యంలో మునిగిపోయారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణు త‌న సోష‌ల్ మీడియాలో ఓ ట్వీట్ చేస్తూ.. అందులో శ్రీ వెన్నెల కిషోర్ గారి ఇంటికి వెళ్లినప్పుడు ఈ కింది పోటో తీసుకొన్నాను అని అన్నారు. అయితే ఇప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. వెన్నెల కిషోర్ ఈ నోట్లను ఏం చేస్తాడో అని నేను ఆలోచిస్తున్నాను అని కామెంట్ చేశాడు..

మంచు విష్ణు షేర్ చేసిన పిక్ లో 2000 వేల రూపాయల నోట్లు కుప్పలు కుప్పలుగా ప‌డి ఉన్నాయి. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నిజమేనా అన్నా అని కొందరు ప్రశ్నిస్తుంటే.. మరికొందరు మాత్రం మాకు ఓ నోట్ల కట్ట ఇవ్వొచ్చు క‌దా అన్నా.. అని అంటున్నారు. ఇంకొందరు ఇన్ కం ట్యాక్స్ వాళ్లను పిలిచి తీరాల్సందే అంటున్నారు. మొత్తం మీద రెండువేల నోట్ల కట్టలు రద్దుతో.. వెన్నెల కిషోర్ పై… మంచు విష్ణు చేసిన ఈ పోస్టు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News