Telugu Flash News

Venkatesh: వెంక‌టేష్ అల్లుడు కావ‌ల్సిన రామ్ చ‌ర‌ణ్‌.. ఉపాస‌న‌కి భ‌ర్త అయ్యాడా..!

venkatesh and ramcharan

Venkatesh: మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడిగా చిరుత సినిమాతో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టాడు రామ్ చ‌ర‌ణ్‌. తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టిన చెర్రీ ఆ త‌ర్వాత కూడా వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు. రంగ‌స్థ‌లం చిత్రంతో రామ్ చ‌ర‌ణ్ త‌న న‌ట విన్యాసం చూపించాడు.

ఇక రీసెంట్‌గా వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోను అద్భుతంగా న‌టించి పాన్ ఇండియా రేంజ్‌కి వెళ్లాడు. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తుండ‌గా, ఈ సినిమా క‌నుక హిట్ అయితే చ‌ర‌ణ్‌కి టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోను ద‌శ తిరిగిన‌ట్టే అని చెప్పాలి. అయితే తాజాగా రామ్ చ‌ర‌ణ్ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన ఓ విష‌యం వైర‌ల్ అవుతుంది.

అలా మిస్ అయిందా?

టాలీవుడ్‌లో అద్భుతమైన జంటల్లో రామ్ చరణ్, ఉపాసన జంట ఒక‌టి అనే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. రీసెంట్‌గా వీళ్లిద్దరు 10వ వివాహా వార్షికోత్సవం జరుపుకోగా, వారి యానివ‌ర్స‌రీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఎంతో సంతోషంగానే సంసారం సాగిస్తున్న ఈ జంట ఇప్ప‌టి వ‌ర‌కు అయితే పిల్ల‌ల‌ని ప్లాన్ చేయ‌లేదు. త్వ‌ర‌లో గుడ్ న్యూస్ చెబుతార‌ని తెలుస్తుంది.

అయితే ఉపాసనతో చరణ్ పెళ్లికి ముందు చిరంజీవి.. రామ్ చరణ్ వివాహాన్ని వెంక‌టేష్‌ కూతురుతో జరిపించాలనుకున్నారట‌. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత ను చరణ్ కిచ్చి పెళ్లి చేయాలని కుటుంబ స‌భ్యులు అనుకున్నార‌ట‌. చిరు, వెంక‌టేష్ మ‌ధ్య దీనికి సంబంధించి చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ట‌. అయితే దీనిపై రామ్ చ‌ర‌ణ్ మాత్రం నో చెప్పార‌ట‌. తాను కామినేని ఉపాసనతో ప్రేమ‌లో ఉన్న‌ట్టు , త‌న‌ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడట.

దీంతో చిరంజీవి చేసేది లేక వెంకటేష్ కుటుంబంతో సంబంధం క్యాన్సిల్ చేసి ఉపాస‌నతో పెళ్లి చేసిన‌ట్టు స‌మాచారం. 2012 జూన్ 14న రామ్ చరణ్-ఉపాసనల వివాహం అత్యంత వైభవంగా జరిగిన విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే.

మరిన్ని వార్తలు చదవండి :

Taapsee Pannu: జ‌ర్న‌లిస్ట్ ప్ర‌శ్న‌కి కోపంతో ఊగిపోయిన తాప్సీ.. అంత కోప‌మెందుకు అమ్మ‌డు అంటున్న నెటిజ‌న్స్

Nagarjuna: స‌మంత,నాగ చైత‌న్య విడాకుల‌పై స్పందించిన నాగార్జున‌.. సామ్ వెళ్లిపోవ‌డం దుర‌దృష్ట‌కరం..!

Anjeer Benefits:అంజీర్ పండ్ల‌తో లాభాలెన్నో.. అవి తెలిస్తే వదిలి పెట్ట‌రు..!

 

Exit mobile version