Telugu Flash News

Venkatesh: వెంక‌టేష్ నోటి నుండి ఆ మాట రావ‌డంతో ఉలిక్కిప‌డ్డ ఫ్యాన్స్..!

rana naidu

Venkatesh: విక్ట‌రీ వెంక‌టేష్ ఫ్యామిలీ చిత్రాల‌కు కేరాఫ్ అడ్రెస్ అన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి వివాదాస్ప‌ద చిత్రాల‌లో న‌టించ‌లేదు. అయితే రానా నాయుడు అనే వెబ్ సిరీస్‌తో తొలిసారి డిజిట‌ల్ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. రానా కూడా ఇందులో ప్ర‌ధాన పాత్ర పోషించాడు. అంచనాలకు తగ్గట్లుగానే ట్రైలర్ ఉండటంతో.. ప్రేక్షకులు ఈ సిరీస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ వ‌చ్చారు. రీసెంట్‌గా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయింది.

అయితే ఇందుకు సంబంధించిన ప్రీమియర్ షోలో వెంకటేష్ మాట్లాడుతూ..”రానా నాయుడు ఓ డార్క్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పాడు. ఈ వెబ్ సిరీస్ లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. హింస, సె*క్స్ కూడా ఉన్నాయి అని అన‌గానే అంద‌రు ఒక్క‌సారిగా న‌వ్వేశారు. వెంకీ కూడా అయ్యో అలా అనేశానా అంటూ వెరైటీ ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చాడు.

ఇక ఇది రానా షో అని ఎక్కడైనా ఇబ్బందిగా అనిపిస్తే.. క్షమించండి అని వెంకటేష్ స్ప‌ష్టం చేశాడు. గురువారం అర్ధరాత్రి తర్వాత స్ట్రీమింగ్ కావ‌ల్సిన వెబ్ సిరీస్ అనుకోని కార‌ణాల వ‌ల‌న శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుండి స్ట్రీమ్ అవుతుంది.

మరిన్ని వార్తలు చదవండి :

Shriya Saran You And I Magazine Photoshoot Photos 2023

Raashi Khanna Latest instagram photos, images, stills 2023

Exit mobile version