Veera Simha Reddy telugu movie review : నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన మాస్ ఎంటర్‌టైనర్ ‘వీర సింహా రెడ్డి’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి సందడి చేశారు. కన్నడ హీరో దునియా విజయ్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఎట్టకేలకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
Veera Simha Reddy telugu movie rating : 3/5.
కథ:
అన్నా చెల్లెళ్ల వైరంతో కథ సాగుతుంది. వీర సింహా రెడ్డి, భానుమతి ఇద్దరు ఒకే తండ్రి పిల్లలు కాగా, వీరసింహారెడ్డికి చెల్లెలు అంటేప్రాణం. కాని చెల్లెలు మాత్రం అన్నయ్యను ఎప్పుడు అసహ్యించుకుంటూనే ఉంటుంది. అన్నయ్యపై పగ తీర్చుకోవడానికి భానుమతి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లాడుతుంది. ఇక అతడిని పెళ్లాడినప్పటి నుండి వీరసింహారెడ్డిని చంపేందుకు కుట్రలు చేస్తూనే ఉంటుంది. అయితే ఓసారి పని మీద వీరసింహారెడ్డి విదేశాలకి వెళ్లగా, అక్కడ చంపించేస్తుంది. మరి వీరసింహారెడ్డికి ఆ విషయం తెలుస్తుందా, తరువాత ఏం జరిగింది అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
పర్‌ఫార్మెన్స్:
ప్లస్ పాయింట్స్
-బాలయ్య యాక్షన్ సీన్స్
-థమన్ మ్యూజిక్
-గోపిచంద్ డైరెక్షన్
మైనస్ పాయింట్స్
– కథ పాతదే అనిపించడం
– కొన్ని సన్నివేశాలు
చివరిగా
వీరసింహారెడ్డి చిత్రంతో బాలయ్య మళ్లీ గర్జించాడనే చెప్పాలి. ఆయన యాక్టింగ్‌కి తోడు థమన్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయింది. బాలయ్య ఎనర్జీని ఎలివేట్ చేడంలో తమన్ పాత్ర చాలా ఉంది ఈసినిమాలో .. మాస్ సీన్స్ కు.. బాలయ్య డైలాగ్స్ కు తగ్గట్టు బీజియమ్ తో పాటు.. పాటలు కూడా ఈసినిమాకు చాలా ప్లస్ అనిచెప్పాలి. ఓవర్ ఆల్ గా బాక్సాఫీస్ దగ్గర బాలయ్య రచ్చ చేస్తున్నాడనే చెప్పాలి.
Also Read:
horoscope today telugu : 12-1-2023 గురువారం ఈ రోజు రాశి ఫలాలు
Ambati Rambabu : ఏపీ మంత్రి అంబటిపై కోర్టు ఆగ్రహం.. కేసు నమోదుకు ఆదేశం.. ఎందుకంటే..!