Telugu Flash News

vastu tips : వాస్తు సమస్యలు – ఏయే సమయాలలో వాస్తు పూజ చేయాలి ?

vastu pooja

vastu pooja

vastu tips : ప్రాచీన కాలములో గృహ నిర్మాణము మరియు గ్రామ నిర్మాణములు శంకువుతో దిక్సాధన చేసి దిశలను గుర్తించి నిర్మాణములు చేసెడివారు. అందువలన గృహములు అన్నీ ఖచ్చితముగా ప్రధాన దిశలకు ఉండేవి. కానీ ప్రస్తుత కాలమునందు ఇల్లు లేక అపార్టుమెంటు కట్టిన స్థలం సరిగ్గా దిక్కులకు ఉండకపోవటం జరుగుతుంటుంది. అలాంటి సందర్భాలలో దక్షిణ లేక తూర్పు దిశలకు తల పెట్టి నిద్రించుట కుదురుట లేదు.

కొందరు దక్షిణ దిక్కు అని తలపెట్టి నిద్రిస్తుంటారు. నిజానికి అయస్కాంత దిక్సూచితో చూసినపుడు దక్షిణం దిశ ఆగ్నేయం వైపుకు ఉందనుకుంటే, అతని తల దక్షిణం కొంత, కొంత నైరుతివైపుకు కూడా తిరిగినట్లే. దానిని నైరుతి చూడడం అంటారు. ఇలా దక్షిణం వైపు నిద్రిస్తున్న వ్యక్తి తల నైరుతి చూడడం చెడు ఫలితాలను కలుగజేస్తుంది. ఆ చెడు తీవ్రత ఎన్ని డిగ్రీలు నైరుతి చూస్తున్నది అన్న దానిపై ఆధారపడి ఉంటుంది.

ఆ చెడు ఫలితాల ప్రభావం పిల్లలు, యవ్వనంలో ఉన్నవారి కంటే పెద్దవారిలో తొందరగా కనిపిస్తాయి. ఇంతకుముందు నుంచి ఏదైనా దీర్ఘరోగంతో బాధపడే వారిలో వెంటనే తేడా తెలుస్తుంది. అలా నిద్రించే వారిలో సరిగా నిద్రపట్టకపోవడం, ఉదయం లేవగానే నీరసం, ఇంతకుముందునుంచి ఏదైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే ఒకవేళ తగ్గినా తొందరలోనే మళ్ళీ తిరగబెట్టడం లేదా ఇంకో జబ్బు రావటం జరుగుతుంది.

ఇటువంటి వారు తూర్పువైపు తలపెట్టి నిద్రించే విధంగా మంచం మార్చుకున్నట్లయితే ఉపశమనం కలుగుతుంది. ఆ తూర్పు అనుకున్నది ఖచ్చితంగా తూర్పు కాకపోయినా, కొంచెం ఆగ్నేయం అయినప్పటికీ నైరుతి వైపు తల పెట్టడం కంటే మంచిది. అయస్కాంత దిక్సూచితో చూడడం వీలు కానివారు, దిక్కులు కొంచెం తిరిగి ఉన్నాయి అనుకొనేవారు 15 రోజులు దక్షిణం, మరో 15 రోజులు తూర్పు వైపు తల పెట్టి నిద్రించి, గమనించి ఎటుపక్క తల పెడితే బాగుందనిపిస్తే అటు ఖాయం చేసుకోవాలి.

అపార్టుమెంట్లలో నేలమీద పడుకొనేవారు, డాబామీద పడుకొనేవారు అది మామూలు నేల కాదని, కాంక్రీటు శ్లాబు అని గుర్తుంచుకోవాలి. శ్లాబులో ఇనుపరాడ్లు ఉండడం చేత, శ్లాబు అనుకొని బీములు రావడం చేత (బహుశా) వాటి లోపల

పర్వం ఉన్న ఇనుపరాడ్లు కారణంగా ఏర్పడిన అయస్కాంత క్షేత్రం వల్ల నిద్రపట్టకపోవడంలాంటి సమస్యలు అనుభవంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అపార్టుమెంట్లలో ఎక్కడబడితే అక్కడ పెద్ద పెద్ద బీములు వాడడం చేత ఈ సమస్య మరీ ఎక్కువ. అందుచేత క్రింద పడుకొనే వాళ్ళు చెక్క బల్ల లేదా చెక్కమంచం లాంటిది ఏర్పాటు చేసుకుంటే మంచిది.

ఏయే సమయాలలో వాస్తు పూజ చేయాలి ?

వాస్తు పూజను ఏయే సమయాలలో చేయాలి అనే విషయంలో విశ్వకర్మ ప్రకాశిక ఈ విధంగా నిర్దేశించింది.

గృహారంభం, గృహ ప్రవేశం, ద్వార స్థాపనం, త్రివిధ ప్రవేశాలు, ప్రతి సంవత్సర ఆరంభమందును, యజ్ఞారంభం, పుత్రజననం, ఉపనయనం, వివాహం, గొప్ప ఉత్సవాలు చేసేటప్పుడు, జీర్ణోద్ధార శల్యోద్ధారాలలోను, పిడుగు పడిన లేక దగ్ధమైన గృహాలకు, సర్ప, ఛండాల దూషిత గృహాలలోను, గుడ్లగూబ ప్రవేశించిన ఇండ్లలోను, ఏడు దినములు కాకి ఉన్న ఇంటిలోను, గో మార్జాలాది ధ్వనులు ఏనుగు గుర్రాలు ధ్వనులననుసరించి ధ్వనులు కలిగించు ఇండ్లయందును, స్త్రీలు నిత్యము తగవులాడు గృహములలోను, తేనెతుట్టలు పట్టిన గృహంలో, పావురాలు నివసించు ఇంటిలో, ఇంకను అనేక విధములైన ఉత్పాతములు కలిగినప్పుడు శుభం జరగడం కోసంవాస్తు పురుష పూజ తప్పక చేయాలి.

అంతేకాక గ్రామాలు, నగరాలు, దుర్గాలు, పట్టణాలు, ప్రాసాదాలు, ప్రాజాలోద్యాన తప్పక చేయాలి. వాస్తు పూజ చేయకపోతే దరిద్రం, మృత్యువు, వనాలు, గృహారామ మండపాదులు, నిర్మించునపుడు వాస్తు పూజ విఘ్నాలు కలుగుతాయని చెప్పబడింది.

ఈ క్రింది సందర్భములలో వాస్తును ఆశ్రయించాలి

స్థలం కొనుట, నూతన గృహ నిర్మాణము, గృహము కొనుట, పాత ఇళ్ళు రిపేరు చేయుట, ఇంటిలో మార్పులు చేయుట, ఇంటిని పంచుకోవటం, అపార్టుమెంట్లు కొనుట, కట్టించుకొనుట, అపార్టుమెంట్లలో మార్పులు చేసుకోవటం.

వృత్తి వ్యాపారంలో ఇబ్బందులు, అభివృద్ధి లేకపోవటం, దీర్ఘ రోగాలు, సంతాన సమస్యలు, తరచూ అనారోగ్య సమస్యలు,  ఆకస్మిక ప్రమాదాలు, ఆకస్మిక మరణములు, తరచూ దొంగల బెడద, అగ్ని ప్రమాదాలు, తగాదాలు, కోర్టు గొడవలు, ఇంటిలో నివాసం ఇబ్బందికరంగా ఉండడం, మానసిక అశాంతి ఉండడం మరియు ఇబ్బంది పడడం. ఏ ఇంట్లో మనకు అశాంతిగా, ఏదో “చెప్పలేని ఇబ్బందిగా ఉంటుందో, ఏ ఇంట్లో కుటుంబ సభ్యులు తరచూ కలహించుకుంటారో, ఏ ఇంటికి గబ్బిలం, గుడ్లగూబలు, పాములు తరచూ వస్తూంటాయో లేదా తల దాచుకోవడానికి ప్రయత్నిస్తుంటాయో ఆ ఇంటి వాస్తును సంశయించాలి.

also read : 

Ram Charan: ఉపాసనని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటున్న చ‌ర‌ణ్‌.. బ్యాగులు మోస్తూ మ‌రీ..

Health Tips (08-03-2023) : ఈ 9 ఆరోగ్య చిట్కాలు పాటించి చూడండి..

Rakul Preet Singh bikini Photos | Travel + Leisure Photoshoot

 

Exit mobile version