Vastu for gold : ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకున్నట్లే, ఇంట్లో ఉంచే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఏ దిశలో పడితే ఆ దిశలో విలువైన వస్తువులను పెట్టకూడదని వారు సూచిస్తున్నారు. సరైన స్థలంలో సరైన వస్తువులను పెట్టకపోతే దాని తాలూకు ప్రతికూల ఫలితాలు మనం అనుభవించాల్సి వస్తుందని వారు చెబుతున్నారు.
ఇంట్లో విలువైన వస్తువులు మరియు ఆభరణాలను సరైన దిశలో ఉంచటం వల్ల సంపద, సంతోషం, శ్రేయస్సు కూడా ఆ కుటుంబానికి పెరుగుతుందని వారు సూచిస్తున్నారు. బంగారాన్ని సరైన స్థలంలో ఉంచకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కచ్చితంగా మీరు ఇంట్లో సంపద, సంతోషం ఉండాలి అని కోరుకుంటే బంగారు ఆభరణాలను పెట్టె విషయంలో వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలి.
వాస్తు ప్రకారం బంగారు ఆభరణాలను పెట్టే దిశ:
ఇంటికి కుడివైపున బంగారు ఆభరణాలను ఉంచాలి.
ఇంటికి నైరుతి దిశలో లాకర్లు, అల్మరాలు వంటి బరువైన వస్తువులను ఉంచాలి.
ముఖ్యంగా ఆభరణాలను భద్రపరిచేటప్పుడు మీ లాకర్ లేదా అల్మారాలు దక్షిణం వైపు ఉండేలా చూసుకోండి.
దక్షిణ దిశలో, నైరుతి దిశలో పెట్టినప్పుడు బంగారు ఆభరణాలు మీకు సానుకూల ఫలితాలను ఇస్తాయి.
ఉత్తర దిక్కును కుబేరుని దిక్కుగా పరిగణిస్తారు. ఈ దిశలో బంగారాన్ని పెట్టినప్పటికీ సంపద రెట్టింపు అవుతుందని చెబుతున్నారు.
బంగారు ఆభరణాలను సరైన స్థలంలో పెట్టకపోతే:
బంగారు ఆభరణాలను సరైన స్థలంలో ఉంచకపోతే ప్రతికూల శక్తి వస్తుందని చెబుతారు. బంగారాన్ని భద్రపరిచే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కుటుంబ సభ్యులు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.
వాస్తు శాస్త్రంలో బంగారం:
వాస్తు శాస్త్రంలో బంగారం చాలా పవిత్రమైన లోహం కావడంతో దీనిని భద్రపరచడం విషయంలో ఖచ్చితంగా వాస్తు నియమాలను పాటించడంతో పాటు, బంగారాన్ని ఎప్పుడు శుభ్రంగా పాలిష్ చేసుకొని పెట్టుకోవాలి. బంగారు ఆభరణాలు ధరించి, ఇంట్లో ఉంచుకోవడం వల్ల కుటుంబ సౌభాగ్యం కొనసాగుతుందని కొందరి నమ్మకం.