Telugu Flash News

bigg boss 6 telugu : వాసంతి ఇలా బుక్క‌యిందేంటి.. డ్రామాలొద్దంటూ రేవంత్ చుర‌క‌

bigg boss telugu 6

bigg boss 6 telugu : బిగ్ బాస్ ఈ వారం హౌజ్ మేట్స్‌ని ముప్పు తిప్ప‌లు పెట్టి మూడు చెరువ‌ల నీళ్లు తాగిస్తున్న విష‌యం తెలిసిందే. కంటెస్టెంట్స్ స‌రైన ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చ‌ని నేప‌థ్యంలో బిగ్ బాస్ ర‌క‌ర‌కాల టాస్క్‌లు ఇచ్చాడు. ఫుడ్ కోసం, ఇంట్లో ఉండేందుకు అవసరమైన అర్హత కోసం బ్యాటిల్ ఫర్ సర్‌వైవల్ టాస్క్ ఆడాలని అన్నాడు. దీంతో ఇనయ రెడ్ టీమ్, శ్రీసత్య బ్లూ టీమ్ మధ్య పోటీ జరిగింది. ఈ టాస్క్‌లో శ్రీసత్య బ్లూ టీమ్ ఓడిపోయింది. అయితే ఓడిపోయిన బ్లూ టీం నుంచి ఒకరు నేరుగా నామినేట్ కావాల్సి ఉండ‌డంతో, బ్లూ టీం సభ్యులు ఓటింగ్ ప్రకారం చర్చించుకొని వాసంతి పేరు చెప్పారు.

పాపం వాసంతి…

vasanthi krishnan from bigg boss 6 telugu

తాను గేమ్ బాగా ఆడిన ఆడకున్నా తననే టార్గెట్ చేస్తున్నారు అంటూ వాసంతి అర్జున్ తో గొడవ పెట్టుకుని అలిగి వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. అయిన‌ప్ప‌టికి అత్యధిక ఓట్లతో వాసంతి నామినేట్ కావాల్సి వచ్చింది. ముందు తానే సెల్ఫ్ నామినేషన్ తీసుకుంటానని చెప్పిన శ్రీసత్య.. ఆ తరవాత ఎందుకో వెనక్కి తగ్గింది. దీంతో బ్లూ టీమ్‌లో ఉన్న శ్రీసత్య, గీతూ, వసంతి, సూర్య, అర్జున్, మెరీనా, రోహిత్ లివింగ్ రూమ్‌లో చ‌ర్చ జ‌రిపారు. ముందుగా శ్రీసత్య.. అర్జున్‌ను నామినేట్ చేసింది. ఎంటర్‌టైన్మెంట్ టాస్క్ అర్జున్ సరిగా చేయలేదని చెప్పుకొచ్చింది. తరవాత గీతూ.. ఫిజికల్ టాస్క్‌లో వసంతి బాగా ఆడినా, ఎంటర్‌టైన్మెంట్ టాస్క్‌లో బాగా ఆడలేదని అందుకే ఆమెను నామినేట్ చేస్తున్నానని వసంతిని చూపించింది. దీంతో వసంతి హర్ట్ అయ్యింది.

ఇక‌ బిగ్ బాస్ డిజాస్టర్ పేరుతో మరో గొడవ సృష్టించారు. ఈ వారం ఎవరు సరిగా పెర్ఫామ్ చేయలేదు అనిపిస్తే వాళ్లకు రీజన్స్ చెప్పి డిజాస్టర్ ట్యాగ్ తగిలించాలి అని బిగ్ బాస్ చెప్ప‌డంతో.. అర్జున్ రేవంత్ కి, వాసంతి గీతూకి, మెరీనా గీతూకి ఇలా ఒక్కొక్కరు మరొకరికి డిజాస్టర్ ట్యాగ్స్ తగిలించారు. అయితే ఇక్క‌డ కూడా వాసంతి అడ్డంగా బుక్ అయింది. ఫిజికల్ టాస్క్ లో ఆమె రేవంత్ ని కొట్టింది అని ఆరోపించగా, దానికి స్పందించిన‌ వాసంతి.. రేవంత్ ముందుగా తనని బలంగా గుద్దాడు అని చెప్ప‌గా, దానికి వెంట‌నే.. ‘అమ్మా ఈ డ్రామాలు వద్దుస‌ అని అన్నాడు. ఏదేమైన వాసంతికి డిజాస్ట‌ర్ బ్యాగ్స్ ఎక్కువ రావ‌డంతో ఆమె జైలుకి వెళ్లింది.

 

Exit mobile version