HomecinemaVarun Tej: మ‌రోసారి వార్త‌లలోకి వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి...!

Varun Tej: మ‌రోసారి వార్త‌లలోకి వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి…!

Telugu Flash News

Varun Tej: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌లో వ‌రుణ్ తేజ్ కూడా ఒక‌రు. గ‌త కొద్ది రోజులుగా ఆయ‌న పెళ్లికి సంబంధించి అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ముఖ్యంగా వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి మధ్య లవ్‌ ఎఫైర్‌ నడుస్తుంద‌ని, ఆ మధ్య వీరిద్దరు సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారని వార్త‌లు వ‌చ్చాయి.. నిహారిక పెళ్లికి ఇండస్ట్రీ నుంచి కేవలం లావణ్య త్రిపాఠి మాత్రమే హాజరు కావ‌డంతో ఈ వార్త‌ల‌కి మ‌రింత బ‌లం చేకూరింది. అయితే ఈ వార్త‌ల‌న్నింటిని లావ‌ణ్య త్రిపాఠి కొట్టి పారేసింది. ఇటీవ‌ల నాగ‌బాబు .. వ‌రుణ్ తేజ్ పెళ్లిపై స్పందించిన అమ్మాయి ఎవ‌ర‌నే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు.

తాజాగా లావ‌ణ్య కామెంట్స్‌తో మ‌రోసారి లావణ్య‌- వ‌రుణ్ తేజ్ పెళ్లి విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. వరుణ్‌ తేజ్‌ మోస్ట్ హ్యాండ్సమ్‌ అని చెప్పిన లావ‌ణ్య త్రిపాఠి… నానితో పోల్చితే వరుణ్‌ తేజ్ ఎక్కువ అందంగా ఉంటాడని పేర్కొంది.

పులిమేక సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా సుమ అడ్డాకి హాజ‌రైన లావ‌ణ్య ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ ఉంద‌ని, త్వ‌ర‌లో వీరిద్ద‌రే పెళ్లి చేసుకుంటార‌ని ప్ర‌చారాలు చేస్తున్నారు.

also read :

గుండెపోటు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

currency notes showered : గుజరాత్‌లో రూ. 500 నోట్ల వర్షం

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News