Varun Tej: ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీలకి సంబంధించి ఎన్నో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో నిజం ఏదో అబద్దం ఏదో తెలియక అభిమానులు కాస్త కన్ఫ్యూజన్కి గురవుతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సెలక్టివ్ సినిమాలు చేసుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతున్నాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘గాండీధారి అర్జున’ . త్వరలో ఈ సినిమాతో పలకరించబోతున్నాడు మెగా హీరో. అయితే టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో మెగా హీరో లవ్‌లో ఉన్నాడని కొంతకాలంగా మీడియాలో అనేక వార్తలు వెలువడతున్నాయి. అయితే తాము మంచి స్నేహితులం మాత్రమేనని ఈ జంట స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ వాళ్లిద్దరి రిలేషన్షిప్ గురించి ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి.
తాజా సమాచారం ప్రకారం అందాల భామ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ నిశ్చితార్థం జూన్ లో జరగనుందని పింక్ విల్లా సౌత్ మీడియా సంస్థ ఓ కథనం ద్వారా పేర్కొంది. అంతేకాదు ఈ ఏడాదిలోనే వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని కూడా తెలిపింది. గతంలో పలు పుకార్లు నిజమైన నేపథ్యంలో ఇది కూడా నిజమై ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ అయితే రానుంది. ఇక వరుణ్, లావణ్యల ప్రేమ విషయానికొస్తే.. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్’ షూటింగ్ టైమ్‌లోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డట్టు సమాచారం. అప్పటి నుంచి ఈ జంట పార్టీలకు కలిసే వెళ్లింది. టూర్స్ చెక్కేయడం చేస్తూనే ఉన్నారట.
అయితే తామిద్దరి మధ్య అనుబంధాన్ని వారు ప్రతిసారి కొట్టిపడేసే వారు. వరుణ్, లావణ్య ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో జంటగా నటించగా, ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయిన వీరిమధ్య ప్రేమ చిగురించేలా చేసిందట. మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతీ ఈవెంట్స్‌లో లావణ్య త్రిపాఠి సందడి చేయడంతో ఈ వార్తలకి మరింత బలం చేకూరినట్టైంది. రీసెంట్గా నాగబాబు కూడా వరుణ్‌తేజ్‌కు త్వరలోనే పెళ్లి చేయనున్నామని, ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ అనౌన్స్ చేస్తాడని చెప్పుకొచ్చాడు. అయితే, ఈ కథనంలో నిజం ఎంత అన్నది మెగా కుటుంబం నుంచి ఏదైనా ప్రకటన వస్తే తప్ప నిర్ధారించలేని పరిస్థితి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లావణ్య త్రిపాఠి అయిన దీనిపై ఏమైన క్లారిటీ ఇస్తుందా చూడాలి. కాగా, నాగబాబు కూతురు నిహారిక తన భర్త నుండి విడాకులు తీసుకొని సింగిల్‌గా ఉంటున్నట్టు కొద్ది రోజులుగా అనేక ప్రచారాలు నడుస్తున్న విషయం తెలిసిందే.