Varsha: కొన్ని రోజుల ముందు వరకు సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది హీరోయిన్స్ తాము ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు బుల్లితెర భామల టైం వచ్చింది. ఇటీవల రాకింగ్ రాకేష్-సుజాతలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాగా, ఇక మరి కొద్ది రోజులలోనే వర్ష కూడా పెళ్లి చేసుకోబోతుందనే టాక్ నడుస్తుంది.
ఈ అమ్మడి పెళ్లికి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. అయితే సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి తన అప్డేట్స్ అభిమానులకు తెలియజేసే వర్ష తాజాగా… తన యూట్యూబ్ ఛానల్ లో పెళ్లి భాజా గా మొదలైంది అన్నట్టు ఓ వీడియోని పోస్ట్ చేసింది .
పెళ్లి కోసమే చీరల షాపింగ్ చేస్తున్నట్టుగా వీడియోలో మనకు కనిపించింది. పెళ్లి కోసం ఆమె తీసుకున్న చీరలను అభిమానులకు చాలా ఓపిక గా చూపించింది . దీంతో వర్ష పెళ్లికి ఎంతో దూరం లేదని , మరికొద్ది రోజులలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయనుందని అంటున్నారు.
అంతేకాదు కొందరు ఇమ్మానుయేల్ తోనే జబర్దస్త్ వర్ష పెళ్లి జరుగుతుంది అంటుంటే..మరికొందరు కాదు కాదు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టి పడేస్తున్నారు . చూడాలి మరి దీనిపై జబర్దస్త్ వర్ష ఏమైన స్పందిస్తుందా అనేది.
also read :
hair colour : శిరోజాలకు రంగు వేసుకునే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు..
భారతీయ ఋషులు ఎవరు? ఎంత మంది? ఆ ఋషుల వివరాలు తెలుసుకోండి..
moral stories in telugu : మంచి స్నేహితుని కోల్పోయిన సింహం
Sonam kapoor Profile, Photos, Images, Stills 2023