Telugu Flash News

Vanitha Vijay Kumar: చ‌నిపోయింది నా భ‌ర్త కాదు.. మా పెళ్లి జ‌ర‌గలేదంటూ వ‌నిత విజ‌య్ కుమార్ షాకింగ్ కామెంట్

vanitha vijayakumar

Vanitha Vijay Kumar: పెళ్లిళ్ల‌తో ఎక్కువగా వార్త‌ల‌లో నిలిచి సంచ‌ల‌న న‌టిగా పేరు తెచ్చుకుంది వ‌నితా విజ‌య్ కుమార్. రీసెంట్‌గా పీటర్‌ పాల్‌ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూయ‌గా, అన్ని మీడియా సంస్థ‌లు `వనిత మూడో భర్త మృతి` అంటూ క‌థ‌నాలు ప్రచురించాయి.

ఈ నేపథ్యంలో దీనిపై వనితా విజయ్‌ కుమార్ సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. పీటర్‌ పాల్‌ మృతి ఘటనపై స్పందించాలా? వద్దా అనే కన్‌ఫ్యూజన్‌లో చాలా ఓపిక పట్టాను. కాని నన్ను ఓపికగా ఉండనివ్వ లేదు.

పీటర్‌ పాల్‌తో తనకు న్యాయబద్ధంగా పెళ్లి జరగలేదు. 2020లో కొన్ని రోజులపాటు తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, అది ఆ సంవత్సరమే ముగిసిందని, తాను ఆయన భార్యని కాదని, అతను తన భర్త కాదంటూ వ‌నిత విజ‌య్ కుమార్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పంది.

త‌న‌కు భ‌ర్త ఎవ‌రు లేర‌ని తాను సింగిల్‌గా ఉన్నాన‌ని చెప్పిన వ‌నిత విజ‌య్ కుమార్ భ‌ర్త చ‌నిపోయాడంటూ వార్త‌లు రాయ‌కండి విన్న‌వించుకుంది. చివ‌రిగా మిస్ అంటూ త‌న పోస్ట్ ముగించింది.

also read : 

Vanitha Vijay Kumar: విషాదం.. వ‌నితా విజ‌య్ కుమార్ మాజీ భ‌ర్త క‌న్నుమూత‌

Exit mobile version