Vanitha Vijay Kumar: వనితా విజయ్ కుమార్.. ఈమె పేరు కొన్నాళ్ల కిందట వార్తలలో తెగ నిలిచింది. వరుస పెళ్లిళ్లు చేసుకొని హాట్ టాపిక్ అయింది. ఈమె ఎవరో కాదు ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు కాగా, 1995లో తమిళంలో విడుదలైన ‘చంద్రలేఖ’ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత బిగ్ బాస్ షోతో తమిళంలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.
అయితే వనిత మాజీ భర్త , విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ పీటర్ పాల్ అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచిన సందర్భంగా వనితా విజయ్ కుమార్ సోషల్ మీడియాలో ఏమోషనల్ పోస్ట్ షేర్ చేస్తూ తన బాధని వ్యక్తం చేసింది.
2020 జూన్ 27న వనితా విజయ్ కుమార్, పీటర్ పాల్ కి వివాహం జరగగా, కేవలం నాలుగు నెలల తర్వాత ఇద్దరూ విడిపోయారు. పీటర్ తనతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడని చెప్పుకొస్తూ 2020 అక్టోబర్ లో విడాకులు తీసుకుంది.
also read :
Qualcomm : క్వాల్‌కమ్‌లోనూ ఉద్యోగాల కోతలు.. చిప్ మేకింగ్‌లో అగ్రగామికి తప్పని కష్టాలు!
Viral Video : చదువు కోసం ప్రాణాలకు తెగించి.. విద్యార్థినుల సాహసం!