Telugu Flash News

Ustad Bhagat Singh: రికార్డుల‌ని ఊది ప‌డేసిన ఉస్తాద్..ఆర్ఆర్ఆర్‌ని కూడా బీట్ చేసిందిగా..!

Ustad Bhagat Singh: ప‌వర్ స్టార్ పవన్ కళ్యాణ్ , స్టార్ డైరెక్ట‌ర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వ‌చ్చిన గ‌బ్బ‌ర్ సింగ్ ఎంత సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఇదే కాంబినేష‌న్‌లో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ అనే చిత్రం రూపొందుతుంది. పది రోజుల షూటింగ్ మాత్రమే జరుపుకున్న ఈ చిత్రానికి సంబంధించిన రీసెంట్‌గా గ్లిమ్స్ వీడియో ని విడుదల చేసారు. దీనికి మాస్ రెస్పాన్స్ వ‌చ్చింది. పవర్ స్టార్ మాస్ అంటూ ట్వీట్ల వ‌ర్షం కురిపించారు. గ్లిమ్స్ వీడియో కి కూడా యూట్యూబ్ లో రికార్డ్స్ తిర‌గ‌రాస్తుంది.

గతం లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్ గ్లిమ్స్ కి మొదటి 17 నిమిషాల్లో లక్షకి పైగా లైక్స్ రావ‌డం జ‌రిగింది. ఇక ఆ రికార్డ్‌ని ట్రిపుల్ ఆర్ మూవీ బ్రేక్ చేసింది. చిత్రం గ్లిమ్స్ వీడియో కి మొదటి 13 నిమిషాల్లో లక్ష కి పైగా లైక్స్ వచ్చాయి, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ వీడియో కేవలం 12 నిమిషాల్లోనే లక్షకి పైగా లైక్స్ ని సాధించి పాత రికార్డ్‌ల‌ని చెరిపేసింది. 24 గంటలు గడిచిన తర్వాత ఈ గ్లిమ్స్ వీడియో ఇంకెన్ని మైల్ స్టోన్స్ దాటుతుందా అని మెగా అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version