Telugu Flash News

Ustaad Bhagat Singh:ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ గ్లింప్స్ విడుద‌ల‌.. ఈ సారి థియేట‌ర్స్ ద‌ద్ద‌రిల్లాల్సిందే..!

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: ఇన్నాళ్లు పొలిటికల్ బిజీలో ఉన్న పవన్ కళ్యాణ్ ప్ర‌స్తుతం త‌ను క‌మిట్ అయిన సినిమాల‌ని పూర్తి చేసే పనిలో ప‌డ్డాడు. వరుసగా డేట్స్ ఇస్తూ సినిమా షూట్స్ పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు.ఇప్పటికే వినోదయ సితం సినిమా రీమేక్ షూట్ పూర్తి చేసేసిన పవన్ క‌ళ్యాణ్‌..హ‌రీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తి చేసేసారు. ఇక సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమాకి సంబంధించిన రెండు షెడ్యూల్స్ కూడా పూర్త‌య్యాయి.

ఇక రానున్న రోజుల‌లో ఫ్యాన్స్ కి పండగ వాతావ‌ర‌ణ‌మే. అయితే కొద్ది సేప‌టి క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ విడ‌ద‌ల చేశారు. ఇందులో ప‌వ‌న్ లుక్ కేక పెట్టించేలా ఉంది. పాతబస్తీలో పోలీస్ అధికారిగా పవన్ కళ్యాణ్ కనిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇక‌ లుంగీ కట్టిన పవన్ కళ్యాణ్.. ‘ఈసారి పెర్ఫార్మన్స్ బద్దలైపోతుంది’ అని చెప్పే డైలాగ్ గ్లింప్స్‌కి హైలైట్ అని చెప్పాలి. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. గబ్బర్‌ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో ఈ సినిమా వ‌స్తుండ‌డంతో అంచ‌నాలు పీక్స్ లో ఉన్నాయి. మ‌రి తాజాగా విడుద‌లైన గ్లింప్స్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందొ చూడాలి.

Exit mobile version