Telugu Flash News

jowar millets : ఎముక‌లు బ‌లంగా ఉండాలంటే జొన్న‌లు తిన‌డం మంచిది..!

jowar millets : శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందించ‌డంలో జొన్న‌లు ప్ర‌ముఖ పాత్ర పోషిస్తాయి అన్న విష‌యం తెలిసిందే. పూర్వ కాలంలో జొన్నలను ఆహారంలో భాగంగా ఎక్కువగా ఉపయోగించేవారు. జొన్న సంకటి, జొన్న రొట్టెలు లాంటివి చేసుకుని తినేవారు. అలా తిన‌డం వ‌ల‌న అప్పట్లో ఎక్కువమంది వ్యాధుల బారిన పడకుండా ఉండేవారు. ఇప్పుడు మంచి పోష‌కాలు ఉన్న ఆహారం తీసుకోక‌పోవ‌డం వ‌ల‌న ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తుతున్నాయి. జొన్న‌ల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం చిరు ధాన్యాలు మ‌న‌కు చాలా ప్ర‌యోజ‌నాలు చేకూరుస్తుంటాయి.

చాలా ప్ర‌యోజనాలు..

గోధుమల కంటే జొన్నలు తినడం వల్ల చాలా జీర్ణం సులభంగా అవుతుంది, జీవక్రియలను మెరుగుపరుస్తుంది. ఇందులో గ్లూటెన్ ఉండదు కాబ‌ట్టి బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో కాల్షియం అధిక మోతాదుతో ఉంటుంది. జొన్న తినడం వల్ల మీ ఎముకలు కూడా బలపడతాయి.బ‌ ఇది బరువు తగ్గించడంలో మేలు చేస్తుంది. అనారోగ్యమైన సమస్యలు రాకుండా సహాయపడుతుంది . బరువు తగ్గించడంలో మేలు చేస్తుంది. అనారోగ్యమైన సమస్యలు రాకుండా సహాయపడుతుంది. జొన్న తినడం వల్ల మీ రక్త ప్రసరణ పెరుగుతుంది.

జొన్నలతో రోటీ, కేకులు, చిల్లా, కుకీలు, బ్రెడ్ మొదలైన వాటి తయారీ చేసుకోవచ్చు. ఇందులో పీచు పదార్థం పుష్కలంగా ఉండటంతో జీర్ణకోశానికి మేలు క‌లుగుతుంది. రోగనిరోధక శక్తిని ఇవి పెంచ‌డ‌మే కాక‌ ఎముకల దారుఢ్యాన్ని మెరుగుపరుస్తాయి. జొన్నలు బాలింతలకు చాలా మంచివి. వీటిల్లో ఉండే ప్రోటీన్సు పిల్లల ఎదుగుదలకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులను దూరం చేసేందుకు జొన్నలు ఎంతగానో సహకరిస్తుంది.

 

Exit mobile version