US Tornado : అగ్రరాజ్యం అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. యూఎస్‌లో ఈ టోర్నడోలు సాధారణమే అయినప్పటికీ ఈసారి కాస్త భారీగానే ప్రతాపం చూపించాయి. ఆర్కిటిక్ మహాసముద్రం నుంచి భారీ సుడిగాలులు తరచూ అమెరికా భూభాగంపైకి వస్తుంటాయి.
ఇక తాజాగా ఈ టోర్నడోల ధాటికి మిసిసిపీ రాష్ట్రం అల్లకల్లోలమైంది. అతిపెద్ద టోర్నడో విరుచుకుపడడంతో ఇప్పటి వరకు 26 మంది చనిపోయారు. డజన్ల కొద్దీ గాయాలపాలయ్యారు. పలువురి జాడ తెలియరాలేదు. మిసిసిపీ ప్రాంతంతో పాటు అలబామా, టెన్నెస్సీ రాష్ట్రంలోనూ టోర్నడోలు విరుచుకుపడ్డాయి.
టోర్నడోల ధాటికి వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. 83 వేల ఇళ్లు, కార్యాలయాలకు విద్యుత్ సరఫరా స్తంభించింది. పలు చోట్లు కరెంటు స్తంభాలు నేలమట్టం అయ్యాయి. చాలా వరకు వాహనాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఎక్కడ చూసినా అల్లకల్లోల దృశ్యాలే కనిపిస్తుండటంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మిసిసిపీ, అలబామాలో 24 గంటల్లోనే 11 టోర్నడోలు వచ్చాయని అక్కడి అధికారులు తెలిపారు. సాధారణంగా టోర్నడోలు వస్తున్నప్పటికీ ఈసారి కాస్త సుడిగాలుల ప్రభావం కారణంగా ఎక్కువగా వచ్చాయని చెబుతున్నారు.
సహాయక చర్యలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారినికి ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఎక్కువగా తీర ప్రాంతాల్లో ఉండే వారిపైనే ఈ టోర్నడోల ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది.
షార్కీ కౌంటీలోని సిల్వర్ సిటీ, జాక్సన్, రోలింగ్ ఫోర్క్‌తోపాటు.. కరోల్, వినోనా, హంఫ్రీస్ కౌంటీలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. ఫైర్ సిబ్బంది, అంబులెన్స్ సర్వీసులు నిరంతరం పని చేస్తున్నాయి. రోడ్లపై ఎగిరిపడిపోయిన వాహనాలు, చెట్లు, కరెంటు స్తంభాలను సిబ్బంది తొలగిస్తున్నారు.
😪Rolling Fork, Mississippi after tornado last night pic.twitter.com/pSXOv3Ef9L
— Truthseeker (@Xx17965797N) March 25, 2023
మరోవైపు మరిన్ని టోర్నడోలు వచ్చే ప్రమాదం ఉందన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఈ టోర్నడోలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్థానికులు తమ ప్రాంతం ఎలా అయిపోయిందో వీడియోలు పోస్టు చేస్తున్నారు.
This what a tornado looks like pic.twitter.com/55Rae3OxUj
— Nature is Scary (@DISASTERVIDE0) March 22, 2023
వారికి మద్దతుగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో అరుదైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా రాష్ట్రంలో టోర్నడో అతలాకుతలం చేసింది. లాస్ ఏంజిల్స్ సమీపంలోని మోంటెబెల్లో నగరాన్ని ఈ టోర్నడో కుదిపేసింది. ఇది చరిత్రలోనే అతిపెద్ద సుడిగాలి అని అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 85 మైళ్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
First Light of Rolling Fork Mississippi after a Violent #Tornado last night. #mswx @SevereStudios @MyRadarWX pic.twitter.com/NG0YcI3TQn
— Jordan Hall (@JordanHallWX) March 25, 2023