HomecinemaUpasana: మెగా కోడ‌లు ఉపాస‌న త‌న సంపాద‌న మొత్తం వారికే ఇచ్చేసిందా?

Upasana: మెగా కోడ‌లు ఉపాస‌న త‌న సంపాద‌న మొత్తం వారికే ఇచ్చేసిందా?

Telugu Flash News

Upasana: మెగా కోడలు ఉపాసన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అపోలో ఆస్పత్రులకు చెందిన కార్యక్రమాలు చూసుకోవడమే కాక.. అనేక సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ.. అంద‌రి ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంటుంది. ప్రస్తుతం అపోలో లైఫ్‌కి మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఉపాస‌న ఓ వైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తూనే మరోవైపు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్ర‌జ‌ల‌కి చాలా ద‌గ్గ‌ర అవుతుంది.

తాజాగా ఉపాసన తన సంపాదనను మహిళల కోసం విరాళంగా అందించి గొప్ప‌ మనసు చాటుకుంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో హౌజ్‌ ఆఫ్‌ టాటా వారి జోయా కొత్త స్టోర్‌ను ప్రారంభించిన ఉపాస‌న‌.. స్టోర్‌ ప్రారంభించింనందుకుగాను.. యాజమాన్యం ఇచ్చిన రెమ్యునరేషన్‌ను మహిళల కోసం విరాళంగా అందించి మంచి మ‌న‌సు చాటుకుంది .

ఈ మొత్తాన్ని దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్, దాని కార్యక్రమాలకు విరాళంగా అందించ‌డంతో ఉపాస‌న గొప్పత‌నాన్ని నెటిజ‌న్స్ పొగిడేస్తున్నారు. అణగారిన వర్గాలకు చెందిన మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు తమ దోమకొండ ట్రస్ట్ ఎల్ల‌ప్పుడు కట్టుబడి ఉంటుందని చెప్పుకొచ్చింది ఉప్సీ.

Upasana: ఇన్నాళ్లు పిల్ల‌ల్ని క‌న‌క‌పోవ‌డంపై స్పందించిన ఉపాస‌న

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News