UP teacher : పాఠాలు చెప్పే ప్రతీ వ్యక్తి ఉపాధ్యాయుడే, ఉపాధ్యాయుడంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తి అని అనుకోవద్దు. బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుంచి చూపించే ఉద్యోగస్తుడు ఉపాధ్యాయుడే. అయితే విద్యార్ధులని తీర్చిదిద్దే ఉపాధ్యాయలు చాలా ప్రత్యేకం అని చెప్పాలి. తమ పిల్లలని ఒక ఉన్నత స్థానంలో, సరైన మార్గంలో ఉండేలా తీర్చిదిద్దమంటూ ఉపాధ్యాయులను తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ కొందరు ఉపాధ్యాయులు మాత్రం దానికి మచ్చ తెచ్చే పనులు చేస్తుంటారు.
దారుణాతి దారుణం..
కొందరు ఉపాధ్యాయులు తాగి రావడం, మరి కొందరు పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేస్తున్నారు. ఇంకొందరు క్లాసులోనే విద్యార్థులతో సపర్యలు చేయించుకొవడం, చేస్తున్న ఘటనలు మనకు ఎన్నో దర్శనం ఇస్తున్నారు. రీసెంట్‌గా ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తాగి స్కూల్ కు రావడమే కాక తనతో పాటు మందు బాటిళ్లను కూడా క్లాసులోకి తీసుకెళ్లాడు. అతని ముందు చిన్నపిల్లలు క్లాసులో కూర్చుని ఉండడం అందరిని ఆశ్చర్యపరిచింది.
అయితే ఉపాధ్యాయుడు చేస్తున్న ఈ పనిని ఒక వ్యక్తి గమనించి నిలదీశాడు. దీంతో ఉపాధ్యాయుడు మందుబాటిళ్లను దాచిపెట్టడానికి ప్రయత్నించాడు. దీంతో అక్కడ చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో సదరు వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది. దీంతో దీనిపై అధికారులు సీరియస్ కావడమే కాక, ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ పోలీసులను కోరారు.
#WatchVideo: #UP teacher allegedly drunk while teaching students in #Hathrasschool#UPNews #UttarPradesh #Drunk #School #Students #ViralVideo #UPPolice pic.twitter.com/kYBLyr8rgx
— Free Press Journal (@fpjindia) October 2, 2022