Telugu Flash News

Balakrishna : అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 3 ఎప్పుడు మొద‌లు, తొలి గెస్ట్ ఎవ‌రంటే..!

Bala Krishna

నంద‌మూరి బాల‌కృష్ణ‌ (Balakrishna) లో మ‌రో యాంగిల్ చూపించిన షో అన్‌స్టాప‌బుల్ (unstoppable) . స‌క్సెస్ ఫుల్‌గా రెండు ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ షో త్వ‌ర‌లో మూడో సీజ‌న్ జ‌రుపుకోనుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ తో.. అన్ స్టాపబుల్ సీజన్ 2 కు ఎండ్ పడనుంది. ఈ సీజన్ అనుకున్నదానికంటే రెట్టింపు విజయం సాధించడంతో సీజన్ 3పై దృష్టి సాధించారు మేకర్స్.. సీజన్-3 మరింత అట్టహాసంగా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ సీజన్ ఎలా ఉండబోతోంది. ఎలా డిజైన్ చేయబోతున్నారు.. అసలు ఆ థీమ్ ఎలా ఉండబోతుంది అంటూ ప్ర‌తి ఒక్క‌రిలో ఆసక్తి మొదలయ్యింది.

సీజన్-3 మొదటి ఎపిసోడ్ పవర్ ఫుల్ గెస్ట్ లతో స్టార్ చేయాలి అని చూస్తున్నారట. అందుకే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు తెలంగాణ ఐటి మంత్రి కేటిఆర్ కూడా ఈ ఎపిసోడ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదే నిజ‌మైతే రేటింగ్ ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. బాల‌య్య‌, కెటీఆర్ తో కలిసి ఎపిసోడ్ అంటే అది ఏ రేంజ్ లో ఉంటుంది..? ఎలాంటి ప్రశ్నలు బయటకువస్తాయి.. అనేవి ఇప్పటికే ఆడియన్స్ లో మొదలయ్యాయి. మరో వైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ కు కూడా మొన్నటి ప్రభాస్ ఎపిసోడ్ మాదిరిగానే బ్లాస్టింగ్ రేంటింగ్స్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

also read:

వారంలో నాలుగు రోజుల పనితో భారీ బెనిఫిట్స్‌.. అనేక దేశాల్లో ఫుల్‌ జోష్‌!

Viral video : అక్కడ డ్యాన్స్‌ చేసినందుకు పదేళ్ల జైలు శిక్ష.. ఇరాన్‌లో యువ జంటకు షాక్‌!

 

Exit mobile version