Homecinemaunstoppable season 2 : బాలకృష్ణ షో లో పవన్ కళ్యాణ్.. ఎప్పుడో తెలుసా ?

unstoppable season 2 : బాలకృష్ణ షో లో పవన్ కళ్యాణ్.. ఎప్పుడో తెలుసా ?

Telugu Flash News

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 (unstoppable season 2) సూపర్ సక్సెస్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు గోపీచంద్ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో విడుదల అయి సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇంకా ఆ ఎపిసోడ్ లో ప్రభాస్ ముచ్చట్లు ప్రేక్షకులకు ఆసక్తి ని కలిగించింది. ఆ ఎపిసోడ్ డిసెంబర్ 30 న ప్రసారం కానుంది.

ఇపుడు ఈ ఎపిసోడ్ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ రాబోతున్నాడని చర్చ కొనసాగుతుండగా , ఇంకా ఈ అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ షో కి పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా గెస్ట్ లుగా రాబోతున్నారని సమాచారం .

ఐతే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఎప్పుడు షూటింగ్ జరుపుతున్నారనే క్లారిటీ వచ్చింది. ఈ నెల డిసెంబర్ 27న ఈ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ను షూట్ చేయబోతున్నారని తెలిసింది.

అయితే పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ లతో పాటు డైరెక్టర్ క్రిష్ కూడా ఈ ఎపిసోడ్ లో కాసేపు గెస్ట్ గా వస్తున్నాడని అంటున్నారు. మరి బాలకృష్ణ షో కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వస్తే..ఎలాంటి ప్రశ్నలు బాలకృష్ణ అడగనున్నాడని ప్రేక్షకులకు ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఇటు సినిమా పరంగా , మరియు రాజకీయంగా ఉండబోతుందా చూడాలి.. లేదా ప్రభాస్ ఎపిసోడ్ లా సరదాగా సాగుతుందా.. ఇలా రకరకాలు గా నెటిజెన్స్ ఊహిస్తున్నారు.

ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ – నందమూరి బాలకృష్ణ ఒకే వేదిక పై వస్తుండగా , ఇద్దరి మధ్య వ్యక్తిగత విషయాలు చర్చ కి రావడం నిజంగా ప్రేక్షకులకు కి ఫుల్ ట్రీట్ . ఎలాగూ త్రివిక్రమ్ కూడా ఆ షో లో ఉంటాడు. ఎవరిపై ఎవరు పంచ్ డైలాగ్స్ వేస్తారో చూడాలి మరి. ఈ ఎపిసోడ్ కచ్చితంగా సరికొత్త రికార్డ్స్ ను సృష్టించడం ఖాయం అని చెప్పొచ్చు.

also read news:

-Advertisement-

Bihar Bridge Collapse : ప్రారంభానికి ముందే కుప్పకూలింది.. బిహార్‌లో బ్రిడ్జి పనుల్లో డొల్లతనం

చలికాలంలో పచ్చి బఠానీ లు తింటే అనారోగ్య సమస్యలు దూరం..

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News