Telugu Flash News

undavalli arun kumar : పవన్‌ కల్యాణ్‌ సీఎం అభ్యర్థి? ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు!

vundavalli arun kumar comments on pawan kalyan alliance

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తనదైన మార్క్‌ విశ్లేషణతో పాపులర్‌ అయిన కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ (undavalli arun kumar) మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి కాస్త డిఫరెంట్‌ సబ్జెక్టుతో ముందుకొచ్చారు ఉండవల్లి. ప్రస్తుతం ఏపీలో పొత్తుల విషయం జోరుగా చర్చోప చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉండవల్లి చేసిన విశ్లేషణ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. టీడీపీ-జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌.

వచ్చే ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ (pawan kalyan) ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని ఉండవల్లి చెప్పారు. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా ఇదే జరుగుతుందని తాను భావిస్తున్నానన్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీతో కలిసి ఉన్న జనసేన.. ఎన్నికల సమయానికి బీజేపీని వదిలి టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందని ఉండవల్లి అంచనా వేశారు. ఒకవేళ జనసేనతో పొత్తు పెట్టుకోకపోతే టీడీపీని జగన్‌ భూస్థాపితం చేయడం గ్యారెంటీ అంటూ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈసారి కూడా చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్‌ ఎన్నికల్లో కష్టపడబోడని తాను అనుకుంటున్నట్లు ఉండవల్లి తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ చాలా తెలివైన వాడని, ఈసారి కచ్చితంగా సీఎం పదవిని ఇస్తేనే పొత్తు ఉంటుందని చెప్పే అవకాశాలున్నాయని ఉండవల్లి విశ్లేషించారు. పవన్‌ను సీఎం అభ్యర్థిగా టీడీపీ ఒప్పుకోకపోయినా ఆయన కొత్తగా నష్టపోయేది ఏదీ లేదని ఉండవల్లి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలు టీడీపీకి కీలకంగా మారిన నేపథ్యంలో సీఎం పదవిపై ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

చంద్రబాబు వెనక్కు తగ్గాలి..

ఒకవేళ ఏపీలో సీఎం పదవి కారణంగానే టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదరకపోతే జరిగేదేంటో అందరికీ తెలుసని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రతిపక్షాన్ని టార్గెట్‌ చేస్తూ సీఎం జగన్‌ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న తరుణంలో రాబోయే కాలంలోనూ ఇదే జరుగుతుందని ఉండవల్లి జోస్యం చెప్పారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబే ఒక అడుగు వెనక్కి తగ్గి సీఎం పదవిని పవన్‌ కల్యాణ్‌కు ఆఫర్‌ చేయాలని ఉండవల్లి సూచించారు.

also read :

Rohit Sharma: మ‌తిమ‌రుపు రోహిత్ శ‌ర్మ‌.. పరీక్ష హాల్‌లో స్టూడెంట్ కూడా అంతేనంటూ మీమ్స్

Virat Kohli: ఫుల్ ఫామ్‌లో ఉన్న కోహ్లీని జ‌ట్టులో నుండి తొల‌గించాలంటూ ర‌విశాస్త్రి సూచ‌న‌.. అవాక్క‌వుతున్న ఫ్యాన్స్

Exit mobile version