Telugu Flash News

Rishi Sunak : యూకే ప్రధానిగా వంద రోజులు పూర్తి.. ‘ధర్మం’ ప్రేరణగా కర్తవ్యం చేస్తున్నానన్న రిషి!

rishi sunak latest news

బ్రిటన్‌ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భారత సంతతకు చెందిన రిషి సునాక్‌(Rishi Sunak) విజయవంతంగా హండ్రెడ్‌ డేస్‌ పూర్తి చేసుకున్నారు. అత్యంత కఠిన పరిస్థితుల నడుమ పదవిని అలంకరించిన రిషి.. ప్రస్తుతం తన బాధ్యతలను నిర్వర్తించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఈ జాబ్‌ కత్తిమీద సాము లాంటిదే అని స్పష్టం చేశారు రిషి. అయితే, దాన్ని కర్తవ్యంగా మలచుకొని సమర్థంగా నిర్వహిస్తున్నాననంటూ స్పష్టం చేశారు రిషి సునాక్‌.

ప్రధానిగా బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో రిషి మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. ప్రధానిగా బాధ్యతలను తాను వైవిధ్యంగా నిర్వర్తించగలనని పేర్కొన్నారు. ఇంగ్లిష్‌ దేశానికి ప్రధాని అయినా.. ఆయన హిందూ ధర్మం గురించి మరచిపోలేదని ఆయన ప్రసంగం స్పష్టం చేసింది. ఇందుకు ఆయన కోట్‌ చేసిన కొన్నిమాటలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.

హిందూమతంలో ఉన్న ధర్మం అనే భావన తనకు ప్రేరణ అని రిషి సునాక్‌ స్పష్టం చేశారు. ధర్మమే తనను ప్రజలు ఆశించిన విధంగా కర్తవ్య నిర్వహణ సాగేలా చేసిందంటూ చెప్పారు రిషి సునాక్‌. తన జీవితంలో ప్రజా సేవను ప్రగాఢంగా విశ్వసిస్తున్నానని స్పష్టం చేశారు. ప్రజలు ఎదుర్కొనే సవాళ్లు, ప్రస్తుతం ఉన్న క్లిషట్ పరిస్థితుల గురించి తెలిసినా తాను ధైర్యంగా ముందుకొచ్చానని వెల్లడించారు.

ఈ సందర్భంగా తన జీవిత భాగస్వామి అక్షితామూర్తి గురించి కూడా రిషి ప్రస్తావించారు. ఆమెకు తాను ఎలా లవ్‌ ప్రపోజ్‌ చేశాడో, ఆమె తనకిస్తున్న మద్దతు.. ఇలా అనేక అంశాలను ఆయన ప్రసంగంలో చెప్పారు. మరోవైపు మీడియా సమావేశంలో ఆయన ఇన్‌కమ్‌ గురించి విలేకరులు ప్రశ్నించగా మౌనం వహించారు రిషి.

అయితే, పన్ను రిటర్నులు, ఆర్థిక పరమైన విషయాలు పారదర్శకంగా ఉంచేందుకు తాను ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా.. ద్రవ్యోల్బణం అధిగమించడమే ఏకైక మార్గమని.. ఉద్యోగుల ఆందోళన గురించి అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. జనాదరణ కోల్పోయినా పర్వాలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రిషి.

also read :

Smitha: స్మిత టాక్ షో.. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో.. ఆహాకి పోటీనా.. !

Gold Rates : భారీగా తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియుల హుషారు!

Exit mobile version