Ugram Telugu movie review : ఈవీవీ సత్యనారాయణ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కెరీర్ ప్రారంభం నుండి కామెడీ పాత్రలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వచ్చాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తో అల్లరి నరేష్ అంటే ఒక బ్రాండ్ అనే ఇమేజి ని ఏర్పాటు చేసుకున్న అల్లరి నరేష్ ఈ మధ్య సీరియస్ చిత్రాలు చేస్తున్నాడు.‘గమ్యం’, ‘శంభో శివ శంభో’, ‘మహర్షి’ , నాంది లాంటి సినిమాలు నరేష్‌కు సెపరేట్ ఇమేజ్‌ను క్రియేట్ చేయడంతో ఇటీవల మనోడు అలాంటి చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు.తాజాగా ఉగ్రం చిత్రంతో పలకరించాడు. ‘ఉగ్రం’లో పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా నరేష్ ని ఆవిష్కరించారు దర్శకుడు. మరి ఈ సినిమా కథ ఏంటి, మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ:
హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా క్రైమ్స్ చాలా పెరిగిపోతున్న సమయంలో ఆడపిల్లలు, మహిళలు పెద్దమొత్తంలో కనబడకుండా పోతుంటారు. ఈ మాఫియాకు సీఐ శివ కుమార్ (అల్లరి నరేష్) ఫ్యామిలీ కూడా బలి కావడం జరుగుతుంది. అయితే అదే సమయంలో శివ కుమార్ కి ఓ భయంకరమైన నేపథ్యం ఉంటుంది. అసలు ఈ శివ కుమార్ ఎవరు? ప్రజల అదృశ్యం వెనుక ఉంది ఎవరు? శివ కుమార్ ఈ మాఫియాకు ఎలా చెక్ పెట్టారు? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
పర్‌ఫార్మెన్స్:
పోలీస్ రోల్ లో అల్లరి నరేష్ ప్రేక్షకులని అలరించారు. సినిమా కోసం ఆయన ట్రాన్స్ఫర్మేషన్ మెప్పిస్తుంది. పాత్రలో ఒదిగిపోయి నటించగా ఆయనలోని కామెడీ యాంగిల్ అసలు ఎవరికి గుర్తుకు రాదు. సాధారణంగా కామెడీ చిత్రాల హీరోకి ఈ రేంజ్ ఎలివేషన్స్ అవసరమా అనే భావన కలుగుతూ ఉంటుంది. కాని ఆయన బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ ఎవరికి ఆ ఫీలింగ్ రానివ్వకుండా చేశాయి.నరేష్ భార్య గా మిర్నా బాగానే నటించింది. డాక్టర్ పాత్రలో ఇంద్రజ ఒదగిపోయింది. మిగిలిన పాత్రలు కూడా ప్రేక్షకులని మెప్పిస్తాయి.
ఇక టెక్నికల్ విషయానికి వస్తే.. దర్శకుడు విజయ్ రాసుకున్న కథ బాగున్నా.. కథనాన్ని ఆయన నడిపించిన తీరు అంతగా ఎఫెక్ట్‌గా అనిపించదు. ఫస్టాఫ్ సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది.. లవ్ ట్రాక్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. సినిమా ప్రారంభమైన 20 నిమిషాల తరవాత నుంచి ట్రాక్ ఎక్కుతుంది.. ఇంటర్వెల్ సీక్వెన్స్ కాస్త బాగుంది. మిస్టరీని సాల్వ్ చేయడం, ట్విస్టులు, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ సెకండాఫ్‌లో ప్రేక్షకుడికి కాస్త ఊరట కలిగిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. బీజీఎం పర్వలేదు. మిగతా టెక్నికల్ టీం కూడా సినిమా కోసం బాగానే కష్టపడ్డట్టు తెలుస్తుంది.
ప్లస్ పాయింట్స్
నరేష్ పర్‌ఫార్మెన్స్
ట్విస్ట్‌లు
ఇంటర్వెల్ సీక్వెన్స్
మైనస్ పాయింట్స్:
లవ్ స్టోరీ సీక్వెన్స్
నెమ్మదించిన కథనం
ఫస్టాఫ్
చివరిగా:
‘నాంది’ మ్యాజిక్‌ను ‘ఉగ్రం’ సినిమాతో నరేష్, విజయ్ రిపీట్ చేయలేకపోయారు నరేష్, విజయ్ కాంబో. కథ బాగానే ఉన్నా విజయ్ స్క్రీన్ ప్లేలో కాస్త డిజప్పాయింట్ చేశాడు.ఇన్వెస్టిగేషన్‌లో కూడా కథనం కాస్త నెమ్మదిగా ఉండటం మైనస్ . రోటీని మాస్ యాక్షన్ డ్రామాలా ఉగ్రం సాగింది. యాక్షన్ సినిమాలని ఇష్టపడే వారికి ఈ మూవీ కాస్త టైం పాస్ మూవీగా ఉంటుంది.
also read :
Chaitanya: ఢీ షో వల్లనే చైతన్యకి అన్ని అప్పులు అయ్యాయి.. సంచలన కామెంట్స్ చేసిన ఆట సందీప్
Chiranjeevi: చిరంజీవితో రొమాన్స్ చేయాలని ఉందన్న కోరికని బయటపెట్టిన ఖుష్బూ