HomecinemaUgram: ఉగ్రం సినిమా ఫ‌స్ట్ చాయిస్ న‌రేష్ కాదా.. ఏ హీరోని మిస్ అయి న‌రేష్‌కి అవ‌కాశం వ‌చ్చింది..!

Ugram: ఉగ్రం సినిమా ఫ‌స్ట్ చాయిస్ న‌రేష్ కాదా.. ఏ హీరోని మిస్ అయి న‌రేష్‌కి అవ‌కాశం వ‌చ్చింది..!

Telugu Flash News

Ugram: కామెడీ చిత్రాల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన అల్ల‌రి న‌రేష్ ఇప్పుడు పంథా మార్చి సీరియ‌స్ చిత్రాలు చేస్తున్నారు. ఆయ‌న న‌టించిన నాంది చిత్రం మంచి హిట్ కావ‌డంతో ఇప్పుడు అదే జాన‌ర్‌లో వ‌రుస సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. ఇప్పుడు ఉగ్రం సినిమాతో థియేటర్లలోకి రాబోతున్నారు న‌రేష్ .

నాంది చిత్రానికి దర్శకత్వం వహించిన విజయ్ కనకమేడల ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, ఈ మూవీపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. మే 5న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. అయితే ఉగ్రం సినిమా ఫ‌స్ట్ చాయిస్ న‌రేష్ కాద‌ని తెలుస్తుంది.

నాంది సినిమా తర్వాత విజయ్ కనకమేడల నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కు కథ చెప్పగా, హీరో పోలీస్ ఆఫీసర్ కావడంతో ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేశారట‌.. అందుకు కారణం ఆయ‌న గతంలో పటాస్ చిత్రంలోనూ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించారు. మ‌ళ్లీ అలాంటి రోల్ వ‌ద్ద‌ని క‌ళ్యాణ్ రామ్ అన్న‌ట్టు తెలుస్తుంది.

అయితే కళ్యాణ్ రామ్ కు చెప్పిన స్టోరీతో అల్లరి న‌రేష్ హీరోగా ఉగ్రం సినిమా చేశాడ‌ట‌. కళ్యాణ్ రామ్ కు చెప్పినప్పుడు కేవలం ఐడియా మాత్రమే అని.. కానీ ఆ తర్వాత ఫుల్ స్టోరీని నరేష్ కు చెప్పడంతో ఆయ‌న‌కు న‌చ్చి వెంట‌నే ఓకే చేశార‌ట‌

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News