ugadi recipes 2023 : తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రానే వచ్చింది. ఈ పండుగను తెలుగు వారు ఘనంగా చేసుకొనేందుకు సిద్ధమయ్యారు. ఉగాది పండుగ సందర్భంగా పచ్చడితోపాటు మరికొన్ని నైవేద్యాలను ఇష్టదైవానికి సమర్పిస్తుంటారు. ఉగాది పర్వదినం నేపథ్యంలో సింపుల్‌గా ప్రసాదాలు చేసుకోవడం గురించి చాలా మంది తెలుసుకుంటూ ఉంటారు.
1. వీటిలో ఒకటి అటుకుల పాయసం. అటుకులు, పంచదార, నెయ్యి, జీడిపప్పు, ఎండుద్రాక్ష, యాలకులపొడి, పాలు ఉపయోగించి దీన్ని తయారు చేసుకోవచ్చు. స్టవ్ మీద కడాయ్ పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు, ఎండుద్రాక్షలను వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయ్‌లో అటుకులను వేయించాలి. అవి వేగాక పాలను పోసి ఉడికించాలి. పాలు కాచి చల్లార్చినవి అయి ఉండాలి. పంచదారని వేసి గరిటతో కలపాలి. తర్వాత యాలకుల పొడిని, డ్రై ఫ్రూట్స్‌ను వేసి కలపాలి. అంతే పాయసం రెడీ అయినట్టే. కేవలం 20 నిమిషాల్లో ఈ నైవేద్యం రెడీ అయిపోతుంది.
2. మామిడి తురుము, వండిన అన్నం, పోపు గింజలు, పచ్చిమిర్చి, అల్లం, వేరుశనగ పలుకులు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, ఉప్పు, పసుపు సాయంతో మామిడి కాయ పులిహోర తయారు చేసుకోవచ్చు.
3. పెసరపప్పు, పచ్చి కొబ్బరి తురుము, పంచదార, జీడిపప్పు, యాలకుల పొడి, నూనె ఉపయోగించి చంద్రకాంతలు అనే స్వీట్‌ను తయారు చేసుకోవచ్చు. చంద్రకాంతలు స్వీట్‌ను పూర్వకాలంలో ఎక్కువగా తయారు చేసుకొనే వారు. ఇప్పుడు చాలా మంది చేయడం మానేశారు. ఇలా చేసుకోవడం వల్ల సింపుల్‌గా నైవేద్యం సిద్ధమవుతుంది.
also read :
TSPSC : నాలుగో రోజు విచారణలో మరిన్ని ఆధారాలు.. రాజశేఖర్ ఇంట్లో ప్రశ్నపత్రాలు స్వాధీనం!
ఇండియాలో ఖలిస్తానీ మద్దతుదారుల ట్విట్టర్ అకౌంట్లు బ్లాక్
Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావుపై అసత్య ప్రచారాల వెనుక ఆ రాజకీయ నేత అభిమానులు?!